దళిత పారిశ్రామికవేత్తలను అన్నివిధాలా ప్రోత్సహిస్తాం
5కోట్ల మార్జిన్ మనీ అందిస్తాం
డిక్కీ ఎక్స్‌పో సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్,ఫిబ్రవరి13(జనంసాక్షి): దళిత పారిశ్రామికవేత్తలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని, వారికి ప్రభుత్వం తరఫున పూర్తి సాయం అందజేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. దళితులకు నైపుణ్యాలు ఉన్నా, పరిశ్రమల ఏర్పాటుకు నిధులు లేని పరిస్థితి ఇంతకు ముందు ఉండేదన్నారు. దళిత పారిశ్రామిక వేత్తలకు బ్యాంకులు రుణాలు ఇవ్వటం కష్టంగా మారిందన్నారు. తాము దళిత పారిశ్రామిక వేత్తల కోసం రూ. 5 కోట్లతో నిధులు ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన యంత్రాల కోసం నిధులు సమకూరుస్తామన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఎక్స్‌పో నిర్వహిస్తున్న డిక్కీకి ఆయన అభినందనలు తెలిపారు. ఎక్స్‌పో ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణలో పారిశ్రామిక విధానాలను సరళీకరించామని అన్నారు. అందుకు అనుగుణంగా దళితులు అన్ని రంగాల్లో రాణించేలా పారిశ్రామిక విధానాలు ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.దళిత పారిశ్రామిక వేత్తల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రేడ్ ఎక్స్‌పో సదస్సుకు ఆయన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎక్స్‌పోలో స్టాల్స్‌ను చూస్తుంటే దళితులు శక్తి సామర్థ్యాలు అర్థమవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం దళిత పారిశ్రామిక వేత్తలకు రూ.5 కోట్ల మార్జిన్ మనీ ఇస్తుందని స్పష్టం చేశారు. దళిత పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరముందన్న సీఎం ప్రభుత్వం దళిత పారిశ్రామిక వేత్తలకు పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని హావిూనిచ్చారు. దళిత పారిశ్రామిక వేత్తలు ఉపాధి కోరే స్థాయి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. ఏ పారిశ్రామికవేత్తా..కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి అప్లికేషన్ అయినా తెలంగాణ గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని తెలిపారు. పది, పదకొండు రోజుల్లో పరిశ్రమకు కావాల్సిన అన్ని అనుమతులు మంజూరవుతాయని సీఎం స్పష్టం చేశారు. వారతంతా నేరుగా తనను వచ్చికలుసుకోవచ్చన్నారు. వారికి అన్ని విధాలా తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని హావిూ ఇచ్చారు. కేంద్రంలో కూడా అనుకూల వాతావరణం ఉందని, ప్రధాని తీసుకుంటున్న నిర్ణయాలు కూడా పారిశ్రామికవేత్తలకు వరంగా ఉంటున్నాయని అన్నారు. పారిశ్రామిక రంగంలో ఎస్సీ, ఎస్టీలు మరింత రాణించాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌అన్నారు. దళిత పారిశ్రామిక వేత్తల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రేడ్ ఎక్స్‌పో సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె సెల్ఫ్ మోటివేషన్‌తో లక్ష్యాలను సాధించిన పారిశ్రామిక వేత్తలను భినందించారు. దళిత పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్రం కసరత్తును ముమ్మరం చేసిందని మంత్రి స్పష్టం చేశారు.
డిక్కీ, ఇండస్టీయ్రల్ అండ్ ట్రేడ్ ఎక్స్‌పో సంస్థ ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ¬ంమంత్రి నాయిని, నర్రారవికుమార్ తదితరులు పాల్గొన్నారు.