దళిత విద్యార్థి హత్య దారుణం
– ఖండించిన కెవిపిఎస్
చండ్రుగొండ జనం సాక్షి (ఆగస్టు 17) : రాజస్థాన్ లోని జలరూ జిల్లాలో దళిత విద్యార్థి హత్య అత్యంత దారుణమని కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి రాజా అన్నారు. బుధవారం స్థానికంగా జరిగిన కె వీపీ ఎస్ మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉన్నత కులాల ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన కుండలోని నీటిని దళిత విద్యార్థి తాగాడని టీచర్ నిర్దాక్షిణ్యంగా కొట్టడం, దెబ్బలకు తాళలేక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దళిత విద్యార్థి మృతి చెందడం బాధాకరమని సభ్యసమాజం తలదించుకునే సంఘటన ను కెవిపి ఎస్ ఖండిస్తోందన్నారు. 75ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో భారతీయ విద్యా వ్యవస్థలో కుల మతోన్మాదం తాండవిస్తుందని ప్రతి భారతీయుడు ఈ సంఘటనలను ముక్తకంఠంతో ఖండించాలన్నారు.మృతికి కారకులైన ఉపాధ్యాయులను చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి మిర్యాల మోహనరావు యలమందల లక్ష్మణరావు తదితరులు సభ్యులు పాల్గొన్నారు