దిగివస్తున్న కూరగాయల ధరలు
నిజామాబాద్,నవంబర్21 (జనం సాక్షి) : ప్రస్తుతం రైతులు తెచ్చిన కూరగాయల విక్రయాలు యాభైశాతం వరకు తగ్గిపోగా.. వినియోగదారుల కొనుగోళ్లూ చాలా వరకు తగ్గాయి. వర్షాలు ఈ ఏడాది విస్తారంగా కురవడంతో కూరగాయల దిగుబడి పెరిగింది. ధరలు కూడా తగ్గడంతో తాజా కూరగాయలతో జనం ఊరట చెందుతున్నారు. టమాటాలు,ఇతర కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడిప్పుడే రైతుబజార్లు కాస్త కుదుటపడుతున్నాయి. రైతులు తక్కువ ధరలకు కొనుగోలుదారులకు కూరగాయలు ఇవ్వడానికి సిద్దపడుతున్నారు. నిజామాబాద్ చుట్టపక్కల పండించిన పంటలతో ప్రధాన మార్కెట్‌తో పాటు చుట్టుపక్కల కాలనీల్లో వందలాదిమంది వెండర్లు కూరగాయలు విక్రయిస్తారు. ఇంతకాలం ధరల కారణంగా రైతుబజార్‌లోవిక్రయాలు సగానికి పడిపోయాయని రైతులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉద్యోగులే ఉండడంతో గతంలో వారానికి సరిపడా కూరగాయలను కొనుక్కెళ్లేవారు. ఇప్పుడు రెండు రోజులకు సరిపడేవే కొంటున్నారు. కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో అమ్మకానలు అధిగమిస్తున్నామని అభిప్రాయపడుతున్నారు. దీంతో వ్యాపారాలు మళ్లీ పుంజుకుంటున్నాయని అన్నారు.