దుబ్బ రాజన్న ఆలయ ఆదాయం దుబారా ?., ప్రతి ఏటా పర్నిచర్ కొనుగోలు ?.
సారంగపూర్ (జనంసాక్షి ) 22 అక్టోబర్
సారంగాపూర్ మండలం శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి, ఆలయ ఆదాయంను అధికారులు పొంతనలేని, ఖర్చుల పేరిట దుబారా చేస్తున్నారనే ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఆలయం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ, నూతన ఫర్నిచర్ కొనుగోలు చేసినట్టు రికార్డులలో పేర్కొనడం, భక్తుల ఆరోపణలకు, విమర్శలకు బలం చేకూరుస్తుంది.స్వామి వారికి కి సాలీనా, దాదాపు రూ.లు 90 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆదాయం ఉంటుంది. మహా శివరాత్రి పర్వదినం, వారం రోజులపాటు .జాతర ఉత్సవాలు, శ్రావణ మాసంలోనే ఆదాయంలో దాదాపు 80 శాతం లభిస్తుంది. భక్తుల సౌకర్యాల కల్పన, పర్యవేక్షణకు కార్యనిర్వహణాధికారి, ధర్మకర్తలు, అనువంశిక ట్రస్ట్ సభ్యులు ఉన్నారు.2019. సంవత్సరంలో ఆదాయం రూ.లు 78, 43,372/-
ఖర్చు రూ.లు 67,83,061/- కాగా మిగులు రూ.లు 10,60,311/-
2019-2020. సంవత్సరంలో ఆదాయం రూ.లు 93,24,279/-
ఖర్చు.రూ.లు 69,06,968/- కాగా మిగులు రూ.లు 24,17,311/-
2020-2021, సంవత్సరంలో ఆదాయం రూ.లు, 74,70,049/-
ఖర్చు రూ.లు 74,11,865/- కాగా మిగులు రూ.లు 58,184/- ఉన్నట్టు ఆలయ రికార్డులలో నమోదయింది.
గ్యారెంటీ లేని ఫర్నిచర్ కొనుగోలు చేశారా?
2019-2020 లో రూపాయలు 69,997/- ఖర్చు చేసి ఫర్నిచర్ కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు.
2020-2021 లో ఫర్నిచర్ కొనుగోలు కోసం రూపాయలు 69,585/- ఖర్చు చేసినట్టు రికార్డులలో పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ఫర్నిచర్ కు సంవత్సర కాలం పాటు కూడా వారంటీ, గ్యారంటీ లేకపోవడం ప్రత్యేకత రెండు ఆర్థిక సంవత్సరాల్లోనే. ఫర్నిచర్ కొనుగోలు కోసం రూపాయలు 1,39,582/- ఖర్చు వివరాలు నమోదు చేశారు.
కరెంట్ బిల్లులు, సామాగ్రి, మరమ్మత్తుల కు రూపాయలు 3,84,982/- , 2019-2020 లో కరెంట్ బిల్లులు, సామాగ్రి, రిపేర్లు కోసం రూపాయలు 1,85,000/- ఖర్చు, 2020-2021 లో రూపాతలు 1,99,982/- ఖర్చు చేసినట్టు రికార్డులో పేర్కొనబడింది
ధర్మకర్తల అలవెన్స్ కోసం రూ.లు 2, 40, 000/–, 2019- 2020 లో ధర్మకర్తలు అలవెన్స్ కోసం రూపాయలు 1,20,000/-. 2020-2021 లో చైర్మన్ కారు అలవెన్స్ కోసం, రూపాయలు 1,20,000/-
కోనేరు మరమ్మత్తుల కోసం.రూపాయలు 1,49,963/
2019-2020 లో కోనేరు మరమ్మతులు కోసం రూపాయలు 69,963/-
2020-2021 లో ఇదే కోనేరు కు రూపాయలు 80, 000/-
కిరాయి గదుల మరమ్మతుల కోసం రూపాయలు 1, 29, 750/–, 2019-2020 లో గదుల మరమ్మత్తుల రూపాయలు 60,000/-
2020-2021 లో ఇదే గదుల కోసం రూపాయలు 69,750/_ఖర్చు చేసినట్టు ఆలయ రికార్డులలో నమోదయింది.. ఇది ఇలా ఉండగా ఈ గదుల ద్వారా రెండు సంవత్సరాలో ఆలయానికి రూపాయలు 45,600/- ఆదాయం వచ్చినట్టు రికార్డులలో నమోదు అయింది. .శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి ఆదాయం దుబారా కాకుండా దృష్టి పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, భక్తులు కోరుతున్నారు.