దేశాన్ని మోసం చేస్తున్న బీజేపీ..అచేతన స్థితిలో కాంగ్రేస్..
-టీఆర్ఎస్ తోనే అభివృద్ది..
– ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 18(జనం సాక్షి)
దేశాన్ని బీజేపీ మోసం చేస్తుందని,ఏమి జరిగినా జాతీయ పార్టీ హోదాలో ఉన్న కాంగ్రేస్ అచేతన స్థితిలో కొట్టుమిట్టాడుతుందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..ఆ పార్టీల తీరు నచ్చక సుదీర్గ కాలం సుమారు 30 ఏండ్లు బీజేపీలో పనిచేసిన వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ సీనియర్ నాయకుడు జన్ను ప్రభాకర్,కాంగ్రేస్ సీనియర్ నాయకుడు,35 వ డివిజన్ కాంగ్రేస్ పార్టీ అద్యక్షుడు బాల్య కుమార్, యూత్ నాయకుడు షారూక్ తో పాటు పలువురు 35 వ డివిజన్ కార్పోరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ ఆద్వర్యంలో శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ దేశానికి,రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు..దేశంలో పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్,నిత్ యావసరాల దరలు పెంచి సామాన్యునిపై మోయలేని భారాన్ని మోపుతుందన్నారు..రాష్ట్రాలకు రావాల్సిన హక్కులను కాలరాస్తూ ప్రజలను మోసం చేస్తుందన్నారు.కాంగ్రేస్ పార్టీ అచేతన స్థితిలో ఉందని,ఆ పార్టీకి నాయకత్వం లోపంతో అసమర్థంగా మిగిలిపోయిందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం,మంత్రి కేటీఆర్ గారి మార్గనిర్దేశనంలో ఈ రాష్ట్రం అద్బుత ప్రగతి సాదించిందన్నారు.వారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో 3వేల పైచికు కోట్లతో అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామన్నారు..టీఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు
టీఆర్ఎస్ లో చేరిన వారిలో జన్ను శ్రవణ్,మేకల జాని,జన్ను గోవర్థన్,కే.రాజేష్,జన్ను సుదాకర్,జన్ను రాజు,బాల్య సుబాష్,బాల్య దినేష్,తదితరులు ఉన్నారు..