దేశ అంతర్గత భద్రతలో.. పోలీసులే కీలకం
మారిన పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ అవసరం
ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించడంలో సిఐఎస్‌ఎఫ్ జవాన్లు చూపుతున్న సాహసం అభినందనీయమని కేంద్ర మంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా శావిూర్‌పేటలో జరిగిన సిఐఎస్‌ఎఫ్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో షిండే ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశభద్ర తకు అనుగుణంగా పోలీసులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. సిఐఎస్‌ఎఫ్ సేవలను కొనియాడారు. ఆస్తుల రక్షణెళి ప్రధాన లక్ష్యంగా సిఐఎస్‌ఎఫ్‌ను ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కర్మాగారాలు, శాటిలైట్ సెంటర్లు, కార్యాలయాలు
తదితర రంగాల్లో సిఐఎస్‌ఎఫ్ జవాన్లు చూపుతున్న సాహసం మరపురానిదని ఆయన చెప్పారు. పోలీసులు శక్తివంచన లేకుండా వారి విధులను నిర్వర్తించాలని ఆయన చెప్పారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సంక్షేమం కోసం త్వరలో కొత్త పథకాలను తీసుకురానున్నట్లు షిండే తెలిపారు. శిక్షణ పొందిన 770మంది జవాన్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ¬ంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి, డైరెక్టర్ జనరల్ రాజీవ్ త్రివేది, నీసా డైరెక్టర్ ఆర్.ఆర్. భరద్వాజ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాణిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు షిండేను పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కలుసుకున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని బొత్స షిండేకు వివరించారు. గతంలో షిండే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అందుకనే రాష్ట్రంలోని పలువురు సీనియర్లతో షిండేకు సత్సంబంధాలు ఉన్నాయి. పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్ అనంతరం ఆయన తిరుమలకు బయల్దేరి వెళ్ళారు.