దొంగను పట్టించిన మూడోకన్న

( జనంసాక్షి)                                                                          దొంగతనం చేసి దొంగ పట్ట బడ్డ సంఘటన బోథ్ మండలంలోని ఆతస్యంగా వెలుగులోకి వచ్చంది.వివరాల్లోకి వెళ్తే… బోథ్ ఎస్సై వవీందర్ వివరాల ప్రకారం…ఒక కుటుంబం దగ్గరి బంధువులు మృతి చెందితే అంత్యక్రియల నిమిత్తమై ఇంటికి తాళం వేసి వెళ్ళగా తిరిగి వచ్చసరికి ఇంటిలో దొంగతనం జరిగిఇంటిలో ఉంచిన రూ.35వేలు చోరి కాబడ్డాయి.ఈ మేరకు బాధితుల నుండి ఫిర్యాదు స్వీకరించిన ఎస్సై రవీందర్ దర్యాప్తులో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కమ్మునిటీ సిసి కెమెరాల పుటేజీ పరిశీలించగా దొంగతనం చేసిన వారు దొరికిపోవడమే గాకుండా ,చోరీ సొమ్మను రికవరీ చేసి,నిందితులను రిమాండ్కు తరలించారు.ఈ మేరకు విలేకరుల సమావేశంలో మాట్లడుతూ ఆధునిక కాలంలో సిసి కేమెరాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని,ప్రతీ చోట వీటిని ఏర్పాటు చేసుకునేందుకు కాలనీ వాసులు స్వఛ్చందంగా ముందుకు రావాలన్నారు.ఈ కెమెరాల వల్ల అనుమానితుల కదలికలు ముందుగానే పసిగట్టి ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు