ధరణి సమస్యలు పరిష్కరించాలి
జహీరాబాద్ ఆగస్టు 20 (జనంసాక్షి)ధరణి సమస్యలు పరిష్కరించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి.రాంచందర్ పేర్కొన్నారు.శనివారం ఆయన సమావేశం లో మాట్లాడుతూ జహీరాబాద్ డివిజన్ పరిధిలోని గ్రామాలలో ధరణి మూలంగా పట్టా దర్ పాస్ బుక్స్ రాక ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 24 న జహీరాబాద్ పట్టణం లోని శ్రామిక్ భవన్ లో బాధిత రైతులతో రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది అని. ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ రాష్టం లో ఇచ్చిన పట్టా పాస్ బుక్స్ ను తెలంగాణ ప్రభుత్యం వక్స్, పరెస్టు, ప్రోహెబిటెడ్, పేర్లతో పాస్ బుక్స్ నిలిపివేయాడని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.భూ సమస్యలు, పట్టా పాస్ బుక్ సమస్యల తో ఇబ్బంది పడే వారందరు రావాలని, పాస్ బుక్స్ సాధనకోసం ప్రణాలికను రూపొందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రన్న,అనివిరప్ప,రాజాకాంత్, మనయ్య, సురేష్,దక్షిణామూర్తి, అశోక్,తదితరులు పాల్గొన్నారు.