ధర్మపురిలో భారీవర్షం

కరీంనగర్‌: ధర్మపురి మండలంలో మంగళవారం ఉదయం కురిసిన కుండపోత వర్షంతో తిమ్మపూర్‌ గ్రామంలోని ఎస్సీ కాలనీలో 50 ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ఆహారపదార్ధాలు ఇతర సామగ్రి తడిచి ముద్దయ్యాయి. చంద్రయ్య అనే వ్యక్తి ఇల్లు కూలిపోయింది.