*ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను తక్షణం ఏర్పాటు చేయాలి*

ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు
 నూనె వెంకట్ స్వామి
 రామన్నపేట అక్టోబర్ 23 (జనంసాక్షి)
మండల కేంద్రంలోని అన్ని ఐకేపీ, పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాలలో రైతాంగం 20 రోజుల నుండి వరికుప్పలను పోసినందున తక్షణం ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు. ఆదివారం మండల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ధాన్యానికి 1960 నుండి 2060 వరకు మద్దతు ధర పెంచినందున హమలీకి కూడా 5 రూ.లు అదనంగా పెంచాలని, పత్తికి 6200 నుండి 8200 రూ. క్వింటాకు మద్దతు ధరను పెంచాలని, మధ్య దళారీలకు అవకాశం లేకుండా సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉయ్యాల లింగస్వామి , పోతెపాక విజయ్, గొరిగె నరసింహ, మోటె అంజయ్య, కంచి లక్ష్మయ్య, పోశబోయిన మల్లేశ్ యాదవ్, నీల స్వామి, కావలి ఈదయ్య , ఆవుల అంజయ్య, ఏశబోయిన రామచంద్రయ్య, మెట్టు అంజయ్య, గోగు రమేష్ , గండు అంజయ్య, నన్నూరి యాదగిరిరెడ్డి, చిల్ల వెంకటయ్య, గుండాల రమేశ్ గౌడ్, బాచుప్పల గౌరయ్య, సంకబుడ్డి సత్తయ్య, నూకల నరసింహ  తదితరులు పాల్గొన్నారు.
Attachments area