ధృతరాష్ట్రుని పాలనలో దళితులకు వివస్త్ర

C
– యూపీలో ఖాఖీల కండకావరం

– కళ్లు మూసుకున్న కార్పోరేట్‌ మీడియా

– నోరు విప్పని ‘అగ్ర’ నేతలు

లక్నో అక్టోబర్‌ 9 జనంసాక్షి):

కేంద్రంలో అలాగే ఉత్తర్‌ ప్రదేశ్‌లో ధృతరాష్ట్రుని పాలన సాగుతోంది. దుశ్యాసునుడు నిండు సభలో వివస్త్ర చేస్తే కండకావరంతో యూపీ పోలీసుల నడి బజార్లో బట్టలూడదీసి అవమాన పరిచారు. కార్పోరేట్‌ మీడియా కళ్లు మూసుకుంది, దేశ్‌కి అగ్రనేతల నోరు పెగలడం లేదు. వివరాల్లోకి వెళ్తే….

తమ ఇంట్లో దొంగతనం జరిగింది.. తమకు న్యాయం చేయండి అని పీఎస్‌ కు వెళ్లిన అని ఓ దళిత కుటుంబంతో పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారు. స్టేషన్‌ బైటికి గుంజుకొచ్చి నడి రోడ్డు విూద భార్య భర్తల బట్టలు ఊడదీసి కొట్టారు. ఉత్తరప్రదేశ్‌ లోని దన్‌ కౌర్‌ పోలీసు స్టేషన్‌ పరిదిలో జరిగింది. సునీల్‌ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదును స్టేషన్‌ లో ఉన్న స్టేషన్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ యాదవ్‌ కేసు నమోదు చేయడానికి నిరాకరించాడు. దాంతో ఎందుకు కేసు నమోదు చేయరో చెప్పాలని సునీల్‌ కుటుంభం ప్రవీణ్‌ ను నిలదీసింది. అంతే…. పోలీసు అధికారి ప్రవీణ్‌ కు కోపమొచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయాడు. అతనికి స్టేషన్‌ లో ఉన్న మరికొందరు పోలీసులు తోడయ్యారు. డ్రస్సులో ఉన్న పోలీసులు, డ్రస్సుల్లో లేని పోలీసులు అందరూ కలిసి ఒక్క సారి సునీల్‌ కుటుంబ సభ్యులు, బంధువుల విూద పడ్డారు. కొట్టుకుంటూ రోడ్డువిూదికి ఈడ్చుకొచ్చారు. సునీల్‌ భార్య చీరను లాగి పడేశారు. బట్టలు చించేశారు. అడ్డుపోయిన సునీల్‌ బట్టలు కూడా చించి పడేశారు. అడ్డుకున్న బంధువులను చితక్కొట్టారు. స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ ?ఎఫ్‌ ఐ ఆర్‌ రాయాల్నా వద్దా అనేది నా ఇష్టం నన్నే ప్రశ్నిస్తారా ? అని బూతులు తిట్టుకుంటూ నగ్నంగా ఉన్న సునీల్‌ ను అతని భార్యను రోడ్డు విూద ఈడ్చుకుంటూ కొట్టాడు. వందలాది లాది మంది చూస్తుండగా ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టిన పోలీసులు అంతటితో ఊరుకోకుండా సునీల్‌ పై, అతని భార్యపై, బంధులవులపై క్రిమినల్‌ కేసులు బనాయించి జైలుకు పంపారు. ఈ దుర్మార్గం జరుగుతుండగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన సెల్‌ ఫోన్‌ లో ఈ సంఘటనను చిత్రీకరించి యూట్యూబ్‌ లో పెట్టాడు. ఈ దాడి సంఘటనపై జర్నలిస్టులు ప్రవీణ్‌ యాదవ్‌ ను ప్రశ్నిస్తే అసలు అలాటిదీవిూ జరగలేదని. సునీల్‌ కుటుంబమే పోలీసులపై దాడికి ప్రయత్నించిందని అందుకే వారందరి పై క్రిమినల్‌ కేసులు పెట్టామని చెప్పాడు. అయితే సోషల్‌ విూడియాలో నెటిజన్లు ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోస్టులు పెడుతూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.