నక్సలైట్ల వ్యవస్థను నిర్మూలిద్దాం బంగారు భవితం నిర్మిద్దాం
పినపాక నియోజకవర్గం ఆగస్టు 24 (జనం సాక్షి): భద్రాది కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు అశ్వాపురం ఎస్ ఐ సముద్రాల జితేందర్ ఆధ్వర్యంలో బుధవారం గొందిగూడెం, వెంకటాపురం, తుమ్మలచెరువు గ్రామాలలో గోడ పత్రికను అంటించారు. ఈ సందర్భంగా జితేందర్ మాట్లాడుతూ జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారని, వారికి ఎవరైనా సహాయ సహకారాలు అందించినచో వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయి. మావోయిస్టుల ఆచూకీ తెలిసినవారు పోలీసులకు సమాచారం ఇవ్వగలరని, అట్టి వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని, వారికి తగిన పారిదోషకం ఇవ్వబడునని తెలిపారు.