నగదు రహిత లావాదేవిలాపై అవగాహన సదస్సు
ఎల్లారెడ్డిపేట జూన్ 05, (జనంసాక్షి) నగదురహిత లావాదేవిలలో రైతులు ముందుకు రావాలని నగదు రహిత లావాదేవిలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపై అవగాహన సదస్సును ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కెడిసిసి బ్యాంక్ మేనేజర్ సుజాత అద్యక్షత రైతులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో సహాకార సంఘ అద్యక్షులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ నగదు రహిత లావాదేవిలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. రైతులు నగదు రహిత లావాదేవిలను ఉపయోగించుకోవాలన్నారు. బ్యాంక్‌లో రైతులు ప్రదానమంత్రి యోజన భీమా ద్వారా ప్రతి రైతు 12రూపాయాలు చెల్లిస్తే ప్రమాదవశాత్తు రైతు మృతిచెందితే 5లక్షలభీమా వర్తిస్తుందని ఆయన అన్నారు. రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ అవగాహన సదస్సులో రైతులు పద్మారెడ్డి, రాంరెడ్డి, జగన్‌రెడ్డి, సొసైటీ సిఈఓ కిశోర్‌కుమార్‌తో పాటు 50మంది పాల్గొన్నారు.