నగరం నడిబొడ్డున… ముంబయ్ గుండాల దాదాగిరి
వ్యభిచారం కోసం నలుగురు యువతుల కిడ్నాప్
– రెస్క్యూ హోంపై స్థానికుల దాడి
– విచారణకు ఆదేశించిన మంత్రి
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (జనంసాక్షి) : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని రామం తపూర్‌లో గల ఉజ్వల రెస్క్యూ ¬మ్‌లో నలుగురు యువతులు అపహరణకు గుర య్యారు. దీని వెనుక గుండాల హస్తం ఉందని వీరు ముంబయికి చెందిన వారని తెలిసింది. దాదాపు 15 మంది దుండగులు శుక్రవారం రాత్రి దాడి చేసి నలుగురు అమ్మా యిలను ఎత్తుకెళ్లారు. దీంతో ఆగ్రహించిన మహిళా సంఘాల కార్యకర్తలు, నేతలు శనివారం ఉదయం రెస్క్యూ ¬ం నిర్వాహ కుడు సత్యనా రాయ ణరెడ్డిపై దాడి చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మహిళల నుంచి సత్యనారా యణరెడ్డిని రక్షించి అదుపులోకి తీసు కున్నారు. సెక్స్ రాకెట్ ముఠానే అమ్మా యిలను ఎత్తుకెళ్లి ఉండవ చ్చుననే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ అమ్మాయిని, కోల్‌కత్తాకు చెందన ఇద్దరు అమ్మాయిలను, ముంబైకి చెందిన ఓ అమ్మాయిని దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే, అమ్మాయిల బంధువులే దాడి చేసి వారిని తీసుకుని వెళ్లి ఉంటారని మొదట అనుమానాలు వ్యక్తం చేశారు. మహిళా సంఘాలు రంగంలోకి దిగడంతో సంఘటన మలుపు తిరిగింది. దాదాపు అరగంటపాటు దుండగులు రెస్క్యూ ¬మ్‌లో బీభత్సం సృష్టించారు. దీంతో అందులోని అమ్మాయిలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అపహరణకు గురైన నలుగురు అమ్మాయిలను నెలన్నర క్రితం రెస్క్యూ ¬మ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. సెక్స్ రాకెట్ బ్రోకర్లే దాడికి దిగారని మహిళా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రెస్క్యూ ¬మ్ నిర్వాహకుడు కూడా వ్యభిచారం నిర్వహిస్తున్నాడని వారు ఆరోపించారు. రెస్క్యూ ¬మ్‌లో 15 మంది యువతులు ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే, తనకు ఏ విధమైన సంబంధం లేదని, తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని సత్యనారాయణరెడ్డి చెబుతున్నాడు.
విచారణకు మంత్రి ఆదేశం
ఉజ్వల ¬ంలో యువతుల అపహరణపై విచారణకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా నగర పోలీస్ కమీషనర్, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీని మంత్రి ఆదేశించారు.