నగర సమస్యలపై కమిషనర్‌తో ముఖాముఖి…
కరీంనగర్,జూలై 14(జనంసాక్షి): నగర సమస్యలు, రోడ్ల వెడల్పు, అభివృద్ది అంశంపై నేడు ఫిల్మ్ భవన్‌లో ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ కమిషనర్‌తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు లోక్‌సత్తా ఉద్యమ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్ శ్రీనివాస్, టి రాజమౌళిలు పేర్కొన్నారు. వినియోగదారుల మండలి, లోక్‌సత్తాల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రజాప్రయోజక రౌండ్‌టేబుల్ సమావేశానికి స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, నగరాభివృద్దిలో భాగస్వామ్యమౌతున్న ప్రజలు అందరూ హాజరు కావాలని కోరారు.