ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 257 పాయింట్లు నష్టపోయి 26,763 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 69 పాయింట్లు నష్టపోయి 8,204 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.77 వద్ద కొనసాగుతోంది.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో కోల్ ఇండియా సంస్థ షేర్లు అత్యధికంగా 2.38శాతం లాభపడి రూ.314.10 వద్ద ముగిశాయి. వీటితోపాటు ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, బీపీసీఎల్, రిలయన్స్ సంస్థల షేర్లు లాభపడ్డాయి. అలాగే అరబిందో ఫార్మా సంస్థ షేర్లు అత్యధికంగా 3.45శాతం నష్టపోయి రూ.745.25 వద్ద ముగిశాయి. వీటితోపాటు ఇన్ఫోసిస్, హీరో మోటో కార్ప్, అంబుజా సిమెంట్, హిందుస్థాన్ యునీలివర్ సంస్థల షేర్లు నష్టాలు చవిచూశాయి.