నాగమయ్య గుడిలో భక్తుల విశేష పూజలు
వరంగల్ ఈస్ట్ ,ఆగస్టు 23(జనంసాక్షి )
వరంగల్ నగరంలోని ఉరుసు సుభాష్ నగర్ లో గల శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయంలో మంగళవారం భక్తులు విశేష పూజలు నిర్వహించారు. పవిత్ర శ్రావణ మాసం ఆఖరి మంగళవారం కావడంతో వరంగల్ నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు ఆలయానికి వచ్చి పుట్టలో పాలు పోసి పసుపు కుంకుమ వేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు జాగర్లమూడి శ్రీ రామ్ శర్మ అర్చనలు చేసి తీర్థప్రసాదాలు అందించారు .ఆలయ ఈవో కమల, శ్యాంసుందర్, రాజేందర్, రవీందర్, సత్యనారాయణ ఇతర సిబ్బంది భక్తులకు అన్ని రకాల ఏర్పాటు చేశారు.