నాబార్డ్ లో విశేష సేవలు అందిస్తున్న అనంత పాట్నాకు ప్రశంస పత్రం…
మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న అనంత పాట్నా..
జనంసాక్షి/చిగురుమామిడి (ఆగష్టు 17): భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్ జిల్లాలోని పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో అత్యుత్తమ సేవలందిస్తున్న నాబార్డ్ ఏజీఎం పి అనంత పాట్నా రాష్ట్రమంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో పాట్నా మాట్లాడుతూ జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నాబార్డ్ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు,వాటర్ షెడ్, క్లైమేట్ రూపీంగ్ ప్రాజెక్ట్స్ ఫామ్ సెంటర్ ప్రమోషనల్ డి పి ఆర్ ప్రొడక్ట్స్ ఎమ్ ఈడిపిఎల్ ఈడిపితోపాటు సేవ్ వాటర్ క్యాంపెయిన్ స్వచ్ఛభారత్ అభియాన్,విఎల్ పి ప్రోగ్రామ్స్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్ ఏ ఎఫ్,గోదాముల సబ్సిడీ మహిళలకు వృత్తి శిక్షణ కోర్సులతోపాటు వారికి క్షేత్ర పర్యటనకు సంబంధించిన ఎక్స్పోజర్ విజిట్, వాళ్లకు క్రెడిట్ లింక్ అయ్యే సౌకర్యాలను అందించి వారి చేత మంచి వ్యాపారవేత్తలుగా గా తయారు చేయించినందుకుగాను జిల్లా స్థాయిలో నాబార్డ్ కార్యక్రమాల ద్వారా అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ప్రశ్నస పత్రాన్ని అందజేసినట్లు అనంత పాట్నా తెలిపారు.అనంత పాట్నా కు ప్రశ్నస పత్రం రావడం పట్ల రైతులు నాబార్డ్ అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.