నింగికెగసిన ఆనందం
– పీఎస్‌ఎల్‌వీసి-30 ప్రయోగం విజయవంతం
– ఆస్ట్రోశాట్‌తో సహా ఏడు ఉపగ్రహాలు కక్ష్యలోకి
– ఇస్రో శాస్త్రవేత్తల హర్షం
శ్రీహరికోట, సెప్టెంబర్28(జనంసాక్షి): అంతరిక్షంలో ఇస్రో మరో ఘనతను సొంతం చేసుకుంది. అరుదైన ప్రయోగానికి తెరతీసి విజయతీరాలకు చేరింది. సొంతగా అస్టోన్రాట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది. అగ్రరాజ్యాల సరసన భారత్‌ను నిలపాలన్న లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రూపొందించిన ‘అసోశాట్’ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ30 రాకట్ ప్రయోగం విజయవంతమైంది. సోమవారం ఉదయం షార్ అంతరిక్షకేంద్రం నుంచి నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ 25.32 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుంది. ఖగోళ పరిశోధనల కోసం భారత్‌కు చెందిన ఆస్టోశ్రాట్ ఉపగ్రహాన్ని రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఖగోళ పరిశోధనల కోసం ఆస్టోశ్రాట్‌ను ఉపయోగించనున్నారు. ఐదేళ్ల పాటు ఆస్టోశ్రాట్ ఉపగ్రహం సేవలందించనుంది. 1630 కిలోల బరువున్న ఉపగ్రహాలను రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి పొలార్ శాటిలైట్ వెహికల్(పీఎస్‌ఎల్‌వీ)-సి30 రాకెట్ ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లింది. విశ్వం మూలాలను తెలుసుకునేందుకు, రేడియేషన్, వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు దీనిని ప్రయోగించారు. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్ శనివారం ఉదయం 8 గంటల నుంచి నిరంతరాయంగా కొనసాగింది. కౌంట్‌డౌన్ పక్రియ ముగిసిన వెంటనే రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన 1,513 కిలోల ఆసోశాట్‌తో పాటు ఇండోనేషియా లాపాన్-2(68 కిలోలు), కెనడాకు చెందిన యాక్సెట్‌యా(5.5) యూఎస్‌కు సంబంధించిన లెమర్-2, 3, 4, 5(16కిలోలు) ఉపగ్రహాలను 650 కిలోవిూటర్ల దూరంలో 6 డిగ్రీల వాలు కోణంలో ప్రవేశపెడతారు. పీఎస్‌ఎల్‌వీ మొత్తం 1,630 కిలోల బరువు గల ఉపగ్రహాలను నింగిలో మోసుకెళ్లింది. ఈ ప్రయోగం నిమిత్తం ఇస్రో చైర్మన్ ఎ.ఎన్.కిరణ్‌కుమార్ ఆదివారం మధ్యాహ్నమే షార్‌కు చేరుకున్నారు. ఇండోనేషియా, కెనడా, అమెరికా దేశాల ఉపగ్రహాలను నింగిలోకి పంపడంతో ఆ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు షార్‌కు చేరుకుని ప్రయోగాన్ని వీక్షించారు. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సి30 రాకెట్ కీలక దశలను విజయవంతంగా దాటుకుని వెళ్లింది. ఈ ప్రయోగం తొలి, రెండు, మూడు దశలు విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. ఖగోళ పరిశోధనలలో తొలి ప్రయోగాన్ని ఇస్రో చేసిందని చెబుతున్నారు. దీని ద్వారా ఆరు విదేశీ ఉపగ్రహాలను రాకెట్ తీసుకు వెళ్లింది.ఇండోనేషియా, కెనడా, అమెరికాలకు చెందిన ఉప గ్రహాలను ఈ రాకెట్ ద్వారా పంపించారు. విశ్వంలో సుదూరంగా ఉండే గ్రహాల ఉనికిని కనిపెట్టడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఖగోళ పరిశోధలన నిమిత్తం ప్రయోగించిన ఆసోశాట్ ఉపగ్రహం ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ… ఇస్రో చరిత్రలో ఈ రోజు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ సందర్భంగా ప్రయోగంలో పాలు పంచుకున్న శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. ఖగోళ పరిశోధనలకు ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-30 విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్, డైరెక్టర్ కున్హికృష్ణన్ అభినందనలు తెలియజేశారు. ఆస్టోశ్రాట్ ప్రయోగం ఖగోళ పరిశోధనల్లో ఎంతగానో ఉపయోగపడుతుందని
కున్హికృష్ణన్ అన్నారు. ప్రధాని ఆశయాలకు అనుగుణంగా ఇస్రో పనిచేస్తోందని కేంద్రమంత్రి సుజనాచౌదరి అన్నారు. పీఎస్‌ఎల్వీ-సీ30 రాకెట్ విజయవంతంపై ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలియజేశారు. పీఎస్‌ఎల్‌వీ విజయవంతం కావడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,ఎపి సిఎం చంద్రబాబు ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని నరేంద్రమోడీ, తదితరులుకూడా ఇస్రోను అభినందించారు.
ఖగోళ పరిశోధల నిమిత్తం ప్రయోగించిన ఆసోశాట్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలను భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు ముఖ్యమంత్రులు అభినందించారు. భారత సైన్స్ రంగానికి, శాస్త్రవేత్తలకు ఇది మరో గొప్ప విజయం అని మోదీ ట్వీట్ చేశారు. ట్విట్టర్ ద్వారా ఇస్రోకు అభినందనలు తెలిపారు. పీఎస్‌ఎల్వీ-సీ30 విజయవంతంపై చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తంచేశారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అలాగే గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞానశాస్త్ర శాఖ మంత్రి హర్షవర్ధన్ పీఎస్‌ఎల్వీ-సీ30 ప్రయోగం విజయవంతం కావడంపై ఆనందం వ్యక్తంచేస్తూ ఇస్రోకు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. పీఎస్‌ఎల్వీ సీ-30 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్రో అంతరిక్ష చరిత్రలో మరిన్ని విజయ శిఖరాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్‌ఎల్వీ సీ-30 ఆస్టోన్రాట్ ఉపగ్రహాన్ని భూకక్షలోకి విజయవంతం పంపగలిగారు.