నిజాం చేసిన అభివద్ధిలో నాలుగొవంతైనా చేయాలి

` మూసీకి 20 టీఎంసీల గోదావరి జలాలు
` అద్భుత నగరాన్ని కాపాడుకునే బాధ్యత మనది
` మూసీ అభివద్దిని బాధ్యతగా తీసుకున్నాం
` ఎవరు సూచనలు ఇచ్చినా తీసుకునేందుకు సిద్దం
` వరదలు వస్తే ప్రజలు నిరాశ్రయులు అవుతున్నారు
` నదులను ఆక్రమించుకోవడం వల్లనే వరదలు
` మూసీ ప్రాజెక్టును విమర్శిస్తున్న వారు అక్కడ ఉండగలరా?
` మూసీ ఇన్వైట్స’ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): మూసీ అభివద్ధి బాధ్యతాయుతంగా చేపట్టాలని ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విదేశాల్లో పలు నదులను సందర్శించి అధ్యయనం చేశారని, ఇప్పటికీ బహత్కార్యాచరణ చేపట్టకపోతే భవిష్యత్ తరాలు క్షమించవన్నారు. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌డీసీఎల్) ఆధ్వర్యంలో నిర్వహించిన ’మూసీ ఇన్వైట్స’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లుగా నిపుణులు, అధికారులతో క్షుణ్ణంగా ప్రతి అంశం పరిశీలించామని చెప్పారు. నిజాంలు, బ్రిటీషర్లు సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించారు. ఈసీ, మూసీ వరదల నియంత్రణకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించారు. వందేళ్ల క్రితం నిర్మించిన జలాశయాలు నేటికీ ప్రజల దాహార్తి తీరుస్తున్నాయి. ప్రపంచ పరిణామాలు, పర్యావరణ మార్పులను పరిగణనలోకి తీసుకోవాలి. అపార మేధో సంపత్తి ఉందని చెప్పేవారు ప్రాజెక్టులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనా తప్ప్పులు చేస్తే సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం అని బిఆరఎస్‌ను ఉద్దేశించి అన్నారు. మూసీ, ఈసీ సంగమ స్థానం లంగర్ హౌస్ వద్ద బాపూ ఘాట్‌ను పర్యాటక కేంద్రం చేస్తాం అన్నారు. కష్ణా, గోదావరి జలాలతో ప్రజల దాహార్తి తీర్చాలని ప్రయత్నించాం. గోదావరి జలాలు 20 టీఎంసీలను మూసీకి తరలించే పనులు చేపట్టామని అన్నారు. మూసీలో నిరంతరం 2.5 టీఎంసీల గోదావరి జలాలు ప్రవహించేలా చర్యలు తీసుకుంటున్నాం. మిగతా 17.5 టీఎంసీల గోదావరి జలాలతో హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చేయత్నం చేస్తున్నాం. ఎంతో ఘనమైన మూసీ చరిత్ర కాలగర్భంలో కలిసిపోతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను కాలగర్భంలో కలిపేద్దామా అని ప్రశ్నించారు. మేం చేపడుతున్న ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదు. పాతబస్తీలో మెట్రో, రోడ్ల విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అభివద్ధి
పనుల కోసం రూ. వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం అని వివరించారు. హైదరాబాద్ నగరంలోని చెరువులను పునరుద్ధరిస్తున్నాం. అందుకు ప్రజలు మాకు ఘన స్వాగతం పలుకుతున్నారు. మూసీ అభివద్ధిని అడ్డుకుంటున్నవాళ్లు.. మూసీ పక్కన నివసిస్తారా? అలాంటి వాళ్లకు కంటెయినర్ హౌస్‌లు ఇస్తా.. అక్కడ నివసిస్తారా? మూసీకి వరదలొస్తే వేలాదిమంది నిరాశ్రయులవుతున్నారు. నీళ్లు ప్రవహించే ప్రాంతాలను మనం ఆక్రమించుకోవడం వల్లే వరదలొస్తున్నాయి. మూసీ ప్రక్షాళన చేయకపోతే నల్గొండ ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. భవిష్యత్ తరాలకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. వారి బాధల్ని కూడా పరిగణలోకి తీసుకొని ప్రాజెక్టుపై ముందుకు వెళ్తున్నాం. దీనికి అందరి సహకారం కావాలని రేవంత్‌రెడ్డి అన్నారు.మూసీ ప్రాజెక్టుపై కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని ఆందోళనకు గురి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మరికొందరు అసంపూర్తి సమాచారంతో తప్ప్పుడు ప్రచారం చేశారన్నారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఇతర దేశాలు వేగంగా అభివద్ధి వైపు పయనిస్తున్నాయని తెలిపారు. మనం కూడా అభివద్ధి వైపు పయనించాలనే మూసీ పునరుజ్జీవం చేస్తున్నట్లు సీఎం రేవంత్ వివరించారు. ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం ఇచ్చారన్నారు. వారికి తాము కాపాలదారులుగా ఉంటామని స్పష్టం చేశారు. సింగపూర్, దుబాయ్, లండన్, సియోల్ నగరాలలో తాను పర్యటించానని చెప్పారు. మనకు ఏం అవసరమో అక్కడ స్టడీ చేసి వచ్చామన్నారు. నదీ పరీవాహక ప్రాంతాల్లోనే ఆర్థిక వ్యవస్థ విరాజిల్లిందన్నారు. గొప్ప నగరం హైదరాబాద్‌ను నిజాం రాజులు మనకు అందించారని తెలిపారు. వందేళ్ల క్రితం నిర్మించిన జలాశయాలు నేటికీ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని చెప్పారు. మూసీ అభివద్ధి బాధ్యతాయుతంగా చేపట్టాలని ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. తమకు పొలిటికల్ డిఫరెన్స్ ఉండొచ్చు.. కానీ పొలిటికల్ పెరాలసిస్ లేదని కుండబద్దలు కొట్టారు. మూసీ పునరుజ్జీవనాన్ని బీఆరఎస్, బీజేపీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని ఆయన సందేహం వ్యక్తం చేశారు. వ్యతిరేకించడం కాదు.. ఎలా చేద్దామో సలహా ఇవ్వండంటూ ఆయా పార్టీల అధినేతలు, అగ్రనేతలకు సీఎం రేవంత్ సూచించారు. విÖ సలహాలు స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ప్రపంచంతో పోటీ పడుతూ అభివద్ధి జరగొద్దా? అని ఆయా పార్టీల నేతలకు సీఎం రేవంత్ ఈ సందర్భంగా చురకలంటించారు. అపార మేధో సంపత్తి ఉందని చెప్పేవారు ప్రాజెక్టుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆరఎస్ నాయకులపై మండిపడ్డారు. పాలసీలు, వర్కింగ్ సెí్టల్ మార్చుకున్నామని చెప్పారు. కొద్దిమంది ముఖ్యమంత్రులే ప్రజలకు గుర్తున్నారని పేర్కొన్నారు. వారు వేసిన పునాదులే అలా గుర్తుంచుకునేలా చేశాయని చెప్పారు. ఎంతసేపు రంగారెడ్డి జిల్లా గురించే ఆలోచిస్తున్నారన్నారు. నల్గొండ జిల్లా గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించారు. మేం తెచ్చే ప్రాజెక్ట్ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. బుల్‌డోజర్లతో కూల్చేస్తున్నారని అంటున్నారని చెప్పారు. అవి చదువుకున్నవాళ్లు మాట్లాడే మాటలా అని ప్రతిపక్షాలను ఆయన సూటిగా ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టును అడ్డుకునే వాళ్లు మూడు నెలలు అక్కడ నివసిస్తారా? అంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు.కన్యాకుమారి లాగా బాపూఘాట్ కూడా రెండు నదుల సంగమం అని ఎంతమందికి తెలుసునని ప్రశ్నించారు. గోదావరి జలాల్లో 20 టీఎంసీలను మూసీకి తరలించే పనులు చేపట్టినట్లు తెలిపారు. గాంధీ విగ్రహానికి సుమారుగా రూ.75 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు చెప్పారు. బీఆరఎస్ పార్టీ వాళ్లు అంబేద్కర్ విగ్రహానికి కోట్లు ఖర్చు చేస్తే తాము వ్యతిరేకించలేదని సీఎం రేవంత్ చెప్పారు.