ప్రీ ప్రైమరీ చిన్నారులకు పాఠ్యపుస్తకాల పంపిణీ

లక్ష్మీ చేయూత సేవా సంస్థ ఔదార్యం
త్వరలో జిరాక్స్ మిషన్ అందిస్తామని వెల్లడి

భీంగల్, జూలై 6 (జనం సాక్షి): భీంగల్ మండలం గోనుగొప్పుల ప్రాథమిక పాఠశాలలో సోమవారం ప్రీ ప్రైమరీ విద్యార్థులకు లక్ష్మీ చేయూత సేవా సంస్థ నిజామాబాద్ ఆధ్వర్యంలో పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. సంస్థ కార్యదర్శి ఎస్. శ్రీనివాస్, క్యాషియర్ ఎ. లక్ష్మణ్, సభ్యులు టి. శ్యాం కుమార్ విద్యార్థులకు స్వయంగా పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చేపూరు చరణ్ గౌడ్ మాట్లాడుతూ, పాఠశాల అవసరాల దృష్ట్యా త్వరలోనే జిరాక్స్ మిషన్ కూడా అందిస్తామని సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో విద్యా శ్రేయోభిలాషులు ఎస్‌ఆర్ భూమేశ్వర్, ఎన్. బోజాగౌడ్, గట్టు భూమేష్‌తో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణ్ కుమార్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. చిన్నారుల విద్యాభివృద్ధికి సహకారం అందిస్తున్న లక్ష్మీ చేయూత సేవా సంస్థకు గ్రామ పెద్దలు, పాఠశాల సిబ్బంది తరఫున సర్పంచ్ చరణ్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తాజావార్తలు