ఇప్ప పహాడ్ గ్రామంలో విషాదం…

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ఉర్కొండ జూలై 06, ( జనం సాక్షి ) ; అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ఇప్పపహాడ్ గ్రామంలో గోపాల్ (40) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్‌కు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ఒకరికి ఇప్పటికే వివాహం కాగా, మరో ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ బాధ్యతలను మోస్తున్న గోపాల్ ఒక్కసారిగా అనుమానాస్పదంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.సమాచారం అందుకున్న ఎస్సై రమాదేవి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజావార్తలు