నిజాం షుగర్స్‌ రైతుల జన్మహక్కు

– ప్రజల వారసత్వ సంపద

– టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం

జగిత్యాల బ్యూరో, డిసెంబర్‌ 10, (జనం సాక్షిó):చక్కెర ప్యాక్టరీలు రాష్ట్రానికి వారసత్వ సంపద అని ప్రభుత్వమే బాద్యత తీసుకొని రాష్ట్రంలోని బోదన్‌, మెదక్‌ ప్రాంతాల్లోని చక్కెర కర్మాగారాలను తెరిపించాలని టిజేఏసి చైర్మన్‌ ప్రొపెసర్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. అదివారం మెట్‌పల్లిలో ముత్యంపేట చక్కెర కర్మాగారం మూసివేతకు నిరసనగా గత కొన్ని రోజులుగా అక్కడి రైతులు చేపడుతున్న నిరసన దీక్షలకు ప్రొపెసర్‌ కోదండరామ్‌ సంఘీబావం ప్రకటించారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ కేసిఆర్‌ నిజాం ప్రభువును పొగుడుకుంటూ ఆ ప్రభువు ప్రారంబించిన నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలను మూసివేయడం దారుణమన్నారు. ఇవే ప్యాక్టరీలను నడిపిస్తే టాక్స్‌ల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం ఉంటుందన్నారు. నిజాం షుగర్‌ ప్యాక్టరీకి తూట్లు పొడుస్తున్నారని రైతులకు ప్రాణప్రదమైన పంట చెఱుకు, పంట తీపి, ప్రజలకు లేకుండా చేస్తున్నారని అభివర్ణించారు. మన ఓట్లకు పుట్టిన బిడ్డలు ఎమ్మెల్యేలు, ఎంపిలు అని వీరిపైన ఓత్తిడి తీసుకొచ్చి ప్రారంబించేలా తగు చర్యలు తీసుకోవాలని మెట్‌పల్లి రైతులకు సూచించారు. రాష్ట్ర స్థాయిలో ఈ విషయాన్ని లోకానికి చాటడానికి సభపై అలోచన చేస్తున్నామని ఈ సందర్బంగా చెప్పారు. సిఎం కేసిఆర్‌ ఆధికారంలోకి వచ్చిన వందరోజుల్లో చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని ప్రకటించారని గత 317 రోజులుగా చెరుకు రైతులు చేస్తున్న దీక్షలను చూసైనా ప్రభుత్వం ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలని అయన డిమాండ్‌ చేశారు. ఈ సంఘీభావ కార్యక్రమంలో కొమిరెడ్డి రాములు, మామిడి నారాయణరెడ్డి, బెజ్జారపు శ్రీనివాస్‌, రైసొద్దిన్‌, అబ్దుల్‌ హాఫీస్‌, రాజయ్య, అక్బర్‌, డబ్బ శేఖర్‌, బండశంకర్‌, రవికుమార్‌రెడ్డి, పురుషోత్తం, ఎంపిపి రాజిరెడ్డి,లతోపాటు పలువురు ఉన్నారు.