నిజామాబాద్‌లో ఓ రౌడీషీటర్ హల్చల్
నిజామాబాద్: నిజామాబాద్‌లో ఓ రౌడీషీటర్ హల్చల్ చేశాడు. రౌడీషీటర్ ఇబ్బు చావుస్ అలియాస్ జంగిల్ ఇబ్బు తన అనుచరులతో కలిసి ఇద్దరు వ్యక్తులపై కర్రలు, రాళ్లతో దాడికిదిగారు. జిల్లా కేంద్రంలోని ఆటోనగర్‌లో ఇర్ఫాన్ ఖాన్, ఇలియాస్‌ను కర్రలతో చితకబాదారు. అనంతరం హోటల్‌పై దాడిచేసారు. అందులో ఉన్న సామాగ్రిని ధ్వంసం చేశారు.
కాగా, పాత కక్షలతోనే దాడి జరిగినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రౌడీ షీటర్, అతని అనుచరుల కోసం గాలిస్తున్నారు.