నిజామాబాద్‌ కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

కమ్మర్‌పల్లి ఆగస్టు 8 (జనంసాక్షి) : జిల్లాకు నూతనంగా వచ్చిన కలెక్టర్‌ క్రిస్టినా జడ్‌చోంగ్తూ బుధవారం కమ్మర్‌పల్లి మండలకేంద్రంలోని హాస్టళ్లు, పిహెచ్‌సి, ప్రభుత్వకార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించి, తనిఖీలు నిర్వహించారు, ఉదయం సరిగ్గా 10 గంటల 30 నిమిషాలకు కలెక్టర్‌ ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు, ఆసమయానికి కార్యాలయ సిబ్బంది ఎవరు విధుల్లోకి రాలేదు పక్కనగల తహశీల్దార్‌ కార్యాలయంలో సిబ్బంది విధులకు వచ్చార లేదా అని తెలుసుకొవాలని సీసీని ఆదేవించారు, అనంతరం కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని సందర్శించి తనిఖీలు చేశారు, హాస్టల్‌లో మరుగుదొడ్లను పరిశీలించారు, మరుగుదొడ్లు పరిశుభ్రంగ లేకపోవడంపట్ల అగ్రహం వ్యక్తం చేశారు. మురుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా తరచు పరిశీలిస్తు ఉండాలని ఎంఈఓ బి రాజేశ్వర్‌ను ఆదేశించారు, పాఠశా లలో టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బంది హాజరు రిజిస్టరులను తనిఖీ చేసి సిబ్బం ది విధుల్లో ఉన్నారోలేదో అని పరిశీలించారు, మెనూ ప్రకారం భోజనం పెడు తున్నారాని విద్యార్థులను అడిగితెలుసుకున్నారు, పాఠ్యాంశాలకు సంభంధిం చిన ప్రశ్నలు అడిగి విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. పాఠశాల అదనపు గదులనిర్మాణాన్ని పరిశీలించారు.

పీహెచ్‌సీలో…

కమ్మర్‌పల్లి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కలెక్టర్‌ క్రిస్టినా జడ్‌చోంగ్తూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు, సిబ్బంది హాజరు రిజిస్టరులను తనిఖీ చేశారు. ఆరోగ్య కార్యక్రమాల అమలు గూర్చి పీహెచ్‌సీ వైద్యులు డా|| కృష్ణచైతన్యను అడిగి తెలుసుకున్నారు, ఆసుపత్రిలో సేేవలు ఎలాఉన్నాయని రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు, అనంతరం ఎస్సీ హాస్టల్‌ను సందర్శించా రు, ఆసమయానికి విద్యార్థులు పాఠశాలలో ఉండడంతో మెనూ ప్రకారం భోజనం అందించాలని వంటమనిషికి సూచించారు, నూతనంగ వచ్చిన కలెక్ట ర్‌ క్రిష్టినా జడ్‌చోంగ్తూ జిల్లాలోని సరిహద్దు మండలమైనా కమ్మర్‌పల్లిలో ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం హర్షణీయమని స్థానికులు చర్చిం కుంటుంన్నారు,

కలెక్టర్‌గారు రోడ్డును చూశారు గదా…

కమ్మర్‌పల్లి మండలకేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలకు వెళ్లెరోడ్డు బురదమయంగా ఎలా ఉందో చూశారుకదా, మీరైనాచోరవచూపి రోడ్డును బాగుచేయిస్తారా అనిపాఠశాల విద్యార్థులు, సిబ్బంది కొరుతున్నారు, ఈ బురద రోడ్డును ఇదివరకు పరిశీలించిన ప్రభుత్వవిఫ్‌ ఈరవత్రి అనిల్‌, అప్పటీ జెడ్‌పీసీ ఇవో కృష్ణారెడ్డి, పీడీ నిర్మల కూమారిలు రోడ్డును బాగుచే యించేందుకు చర్యలు తీసుకుంటామని హమీలు ఇచ్చారు. ఏడాది గడిచిన రోడ్డుబాగుకాలేదు వర్షం కురిసినప్పుడు ముఖ్యంగా రాత్రిపూట ఈరోడ్డు మీద వెళ్లడం కష్టంగా ఉంటుంది. కలెక్టర్‌ క్రిస్టినా బుధవారం పాఠశాల తనిఖీకి ఈ రోడ్డుగుండానే నడుస్తు రోడ్డు పరిస్థితిని పరిశీలించారు, ఈ నేపథ్యంలో కలెక్టర్‌ ఈ రోడ్డును బాగుచేయిస్తారని విద్యార్థులు అశీస్తున్నారు.