నిధులు మంజూరు చేయండి

కరీంనగర్‌, అక్టోబర్‌ 5 :ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాల్లోని రోడ్లు గుంటలమయంగా మారాయని ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి మండలంలోని గుంజపడుగు గ్రామంలో సీసీ రోడ్లను ఆయన శుక్రవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాలు గడిచినా గ్రామాల్లో అభివృద్ధి ఏమీ జరగలేదని ఆయన ఆరోపించారు. గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిగాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది అభివృద్ధిపై దృష్టి పెట్టలేకపోతున్నారన్నారు. నిధులు మంజూరు చేయాలని డిమాండు చేశారు. ఎమ్మెల్యే వెంట టిఆర్‌ఎస్‌ నేతలు వెంకటయ్య, వెంకటరావు, రమేష్‌, మల్లయ్య, నారాయణరెడ్డి, రాజేందర్‌, తదితరులు ఉన్నారు.