నియంత పాలనకు చరమ గీతం పాడదాం

–డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాంచందర్ నాయక్

– రైతులతో కలిసి మిర్చితోట వేసిన డాక్టర్ రామచంద్రనాయక్

– పాదయాత్రకు అడుగడుగునా స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు

కురవి జులై-14
(జనం సాక్షి న్యూస్)

 

రెండో రోజు కురవి మండలంలో మొదలైన పాదయాత్ర
రాష్ట్రంలో నియంత పాలనకు చరమ గీతం పాడాలని డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ జాటోత్ రాంచందర్ నాయక్ అన్నారు. స్వతంత్ర గౌరవ పాదయాత్ర లో భాగంగా 2వ రోజున కురవి మండల కేంద్రంలోని వీరభద్రుని సన్నిధి నుండి ఆయన పాదయాత్ర మొదలైంది.ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లోని ప్రజలతో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వృద్దులకు పింఛన్లు ఇవ్వకుండా,రైతులకు గిట్టుబాటు ధరలు లేకుండా,పేదలకు ఇళ్ళు ఇవ్వకుండా ప్రతి రోజు అసత్యాలు పలుకుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి గా విఫలమయ్యారని వారి కుటుంబానికి మాత్రం పదవులు, నిధులు దోచి పెడుతున్నారని ఆరోపించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన ఇలాగనే కొనసాగితే శ్రీలంక గతే పడుతుందని ఆయన మండి పడ్డారు. సంక్షేమ పథకాలు ఆటకెక్కయని, ఉద్యోగుల లకు జీతాలు ఇవ్వలేక ధనిక రాష్ట్రమని దరిద్రంలోకి నెడుతున్న చేతకాని ప్రభుత్వం టీఆర్ఎస్ అని,ప్రజల ఉసురు పోసుకుని పార్టీ,ఆ పార్టీ నాయకులు డిపాజిట్లు కోల్పోతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల ఋణమాఫి, మహిళలకు వడ్డీ లేని రుణాలు,సంవత్సరం లో 5 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. ఆదివారం రోజు ఆయన పాదయాత్రకు గ్రామ గ్రామాన స్వాగతం పలికిన న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కురవి మండల కేంద్రం నుండి మోదుగుల గూడెం,నల్లెల,తాళ్ల సంకీస,ఉప్పరిగుడెం, కాంపల్లి గ్రామాల మీదుగా డోర్నకల్ వరకు కొనసాగింది. తాళ్ల సంకిసలో గీతా కార్మికులు గౌడన్నాలతో కలిసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో కలిసి మిర్చి తోట వేసిన డాక్టర్ రామచంద్రనాయక్.
ఆయన తో పాటు ఆయన సతీమణి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్రరెడ్డి,కురవి మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రం, టౌన్ అధ్యక్షుడు రాజేందర్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గొల్లపల్లి రజనీకాంత్, నియోజవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్లావత్ సుధాకర్, కంపల్లి గ్రామ అధ్యక్షుడు సత్యం, బిల్యా తండా గ్రామ సర్పంచ్ సురేష్, వస్త్రంతండా బానోత్ దేవేందర్, శ్రీనివాస్,డోర్నకల్ మండల అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ యాదవ్,డిజె శ్రీను, వివిధ గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు, వివిధ గ్రామాల, మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.