నిరుపేద కుటుంబానికి నిత్యావసరాలు పంపిణీ.
ఫోటో రైటప్: నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న ఎంపీటీసీ హరీష్ గౌడ్.
బెల్లంపల్లి, ఆగస్టు16, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం జోగపూర్ గ్రామంలో మంగళవారం బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, గొల్లపల్లి ఎంపీటీసీ హరీష్ గౌడ్ నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జోగపూర్ గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త హరీష్ గౌడ్ అభిమాని అయిన కోడిపే రాకేష్ తల్లి కోడిపే మల్లక్క ఆదివారం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. బీజేపీ కార్యకర్త తల్లి చనిపోయిన విషయం తెలుసుకున్న హరీష్ గౌడ్ రాకేష్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి, నిరుపేద కుటుంబానికి 25 కిలోల బియ్యం ఇతర సామగ్రి అందించారు. హరీష్ గౌడ్ తో పాటు బండి సాయి కుమార్ గౌడ్ మరో 25 కిలోల బియ్యాన్ని తన వంతుగా అందించాడు. ఈకార్యక్రమంలో కోడిపే రాజు, నికాడి నానేష్, గొడ్ల మహేష్, సప్ప అనిల్ తదితరులు పాల్గొన్నారు.