నిరుపేద యువతి వివాహనికి పుస్తె మట్టెలు వితరణ
రుద్రంగి ఆగస్టు 28 (జనం సాక్షి)
వేములవాడ మండలం శాత్రాజుపల్లి గ్రామానికి చెందిన శిరీష అనే నిరుపేద యువతి వివాహం నిచ్ఛయం కాగా అట్టి యువతి తల్లిదండ్రులు చిల్లి గవ్వ లేకుండా వివాహం ఎలా చేసేది అని భాదపడుతున్న తరుణంలో యువతి కి సహాయం చేయడానికి మన చేయూత సేవా సమితి ముందుకు వచ్చింది.ఇట్టి విషయాన్ని చేయూత టీం సభ్యులు ఫెస్బుక్ పేజీ ద్వారా పోస్ట్ పెట్టగా
రుద్రంగి మండలకేంద్రానికి చెందిన ఎన్ఆర్ఐ అద్నాన్ కార్ వాష్ కంపని యజమానికి బొల్లి కుమార్ స్పందించి తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా యువతి వివాహానికి పుస్తే మట్టెలు అందిస్తానని హామీ ఇచ్చి అతని కుమారుడు మణిదీప్ పుట్టిన రోజు సందర్భముగా ఈ రోజు మన చేయూత సేవా సమితి టీం సమక్షంలో యువతికి పుస్తే మట్టెలు అందజేశారు. అలాగే ఓ అజ్ఞాత ఎన్ఆర్ఐ యువతికి రూ.2 వేల విలువ గల చీర అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మన చేయూత సేవా సమితి టీం సభ్యులు లింగంపల్లి గంగాదర్, గడ్డం శేఖర్, పీసరి కిషన్,నెరేళ్ల శేఖర్, మరియు సినీయర్ జర్నలిస్ట్ గసికంటి రాజు తదితరులు పాల్గొన్నారు.