నీటిని పొదుపుగా వాడుకోవాలి
ఎమ్మెల్యే కంచర్ల
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
సాగునీటి కోసం విడుదల చేస్తున్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఏం అర్ పి ప్రాజెక్ట్ డి 40 కాలువ ద్వారా, సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా డి 39 పార్టీ కాలువల ద్వారా సాగునీటి కొరకు తిప్పర్తి నల్గొండ మండలంలోని అన్ని చెరువులను నింపుతున్నామని దీనితో భూగర్భ జలాలు సమృద్ధిగా లభిస్తున్నాయని, రైతు బంధు రైతు బీమా 24 గంటల కరెంటు తో.. రైతులు తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటున్నారని, అదేవిధంగా డిమాండ్ ఉన్న పంటలు మాత్రమే వేయాలని కంచర్ల రైతులకు సూచించారు రైతులు నీటిని వృధా కానివ్వకుండా జాగ్రత్తగా వాడుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో.. తిప్పర్తి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి లింగారావు నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్, సింగిల్ విండో చైర్మన్లు పాశం సంపత్ రెడ్డి, ఆలకుంట్ల నాగరత్నం రాజు, తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, స్థానిక ఎంపీటీసీ ఇందిరమ్మ వెంకటేశం, సర్పంచ్ సురిగి మణెమ్మ రమేష్, నాయకులు, గాదే రామ్ రెడ్డి, పెద్ద సూరారం సర్పంచ్, జయ పాల్ రెడ్డి కంకణాల పల్లి సర్పంచ్ కోన జానయ్య,మండల పార్టీ కార్యదర్శులు వనపర్తి నాగేశ్వరరావు బడ్పుల శంకర్ కందుల లక్ష్మయ్య ఉప్పల మురళి దశరథ, పోతేపాక జనార్ధన్, పట్టణ చెందిన పలువులు కౌన్సిలర్లు ముఖ్య నాయకులు నేటి నీటిపారుల శాఖ చెందిన ఉన్నత ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు