నీలకంఠేశ్వరునికి ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
నిజామాబాద్,నవంబర్19(జనం సాక్షి ): జిల్లాలోని నీలకంఠేశ్వర దేవాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజామున ఆలయానికి వచ్చారు. దీపారాధన చేసిన తర్వాత నీలకంఠుడుకి పంచామృతాలతో అభిశేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. మహాదేవుని కరుణాకటాక్షాలతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని భగవంతున్ని ప్రార్థించానన్నారు.