నులి పురుగు నిర్మూలనమాత్రలు పంపిణీ
ఖానాపురం సెప్టెంబర్ 15జనం సాక్షి
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఖానాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ హై స్కూల్లో ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావునులి పురుగు నిర్మూలనమాత్రలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రావు మాట్లాడుతూపిల్లలందరూ తప్పకుండా నులిపురుగు మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని అన్నారు.ఆరోగ్యంగా ఉంటేనే విద్యను అభ్యసించడం ఈజీగా ఉంటుందని అన్నారు.
ప్రభుత్వం విద్యతోపాటు విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నదని విద్యార్థులు అందరూ వినియోగించుకోవాలని కోరారు.అనంతరం వైద్యాధికారి డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ
పిల్లలకు సంవత్సరానికి రెండుసార్లు డి వర్మింగ్ డే ప్రోగ్రాం సందర్భంగా నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వడం జరుగుతుందనిఅన్నారు.
ఈ మాత్రల వల్లపిల్లల్లో నులి పురుగులు పోతాయని
రక్తహీనత జరగదని అన్నారు.
పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా ఈ మాత్రలు ఉపయోగపడతాయనితప్పనిసరిగా పిల్లలందరూ మాత్రలు వేసుకోవాలని వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవని తెలిపారు.ఈ కార్యక్రమంలో
వైద్యాధికారి రుచిత, హెడ్మాస్టర్ రాజేందర్,
బుధరావుపేట సర్పంచ్ కాస ప్రవీణ్ కుమార్,
గ్రామపంచాయతీ ఈవో సుప్రజ,వైద్య సిబ్బంది
ఫార్మసిస్ట్ సత్యం,హెల్త్ సూపర్వైజర్ యాకస్వామి
ఏఎన్ఎం సునీత,హెల్త్ అసిస్టెంట్
గొడిశాల భాస్కర్.బద్రు నాయక్.
ఆశాలుసునీత విజయ తదితరులు పాల్గొన్నారు.