నూతన ఆవిష్కరణకు చేస్తూ.. ప్రపంచ గర్వించే స్థాయికి ఎదగాలి.

 

 

ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.

గిఫ్ట్ ఎ స్మైల్ ద్వారా 850 మంది విద్యార్థులకు డిజిటల్ ట్యాబ్ ల పంపిణీ._

అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులకు పిలుపు.

విద్యార్థుల్లో ఒకడిగా కలిసిపోయిన మంత్రి మాట ముచ్చట.

సేవా కార్యక్రమాలను పోటీగా తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీల నాయకులకు సవాల్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 22.(జనంసాక్షి). ఉన్నతమైన లక్ష్యాలతో చదివి నూతన ఆవిష్కరణలు చేసి ప్రపంచం గర్వించే స్థాయికి ఎదగాలని మున్సిపల్ ఐటి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. గురువారం గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్ ను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంత చేసిన వ్యక్తిగతంగా ఏదైనా ప్రయోజనం ఉం‌డే కార్యక్రమం చేయాలన్న ఉద్దేశం నుంచి గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమం రూపుదిద్దుకుందని అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవ కార్యక్రమాలు చేయాలన్న పిలుపుపై స్పందించి పలువురి సహకారంతో దివ్యాంగులకు వాహనాలను అందించడంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రులకు అనేక అంబులెన్స్లను సమకూర్చడం జరిగిందని అన్నారు. కరోనా కష్టకాలంలో పెద విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూశానని వారికోసం ఏదైనా చేయాలని సంకల్పంతో బై జాన్ సాఫ్ట్వేర్ కంపెనీ సహకారంతో 850 మంది పేద విద్యార్థులకు డిజిటల్ ట్యాబ్లను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 6000 మందికి అందించినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యా రంగంలో అభివృద్ధి పథంలో ఉందని ఇంజనీరింగ్, వ్యవసాయ కళాశాల తో పాటు మెడికల్ కళాశాల ఏర్పాటు కానుందని అన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో చేపడుతున్న అభివృద్ధి పథకాలు తెలియజేశారు. ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదని సాధించాలని సంకల్పం ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదుగువచ్చని తెలిపారు. ఎదగాలని తపన ఉన్న ప్రతి విద్యార్థికి ప్రభుత్వం చేయూత అందిస్తుందని తెలిపారు. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని నూతన ఆవిష్కరణలు చేస్తూ తెలంగాణ విద్యార్థులుగా ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులతో మాట ముచ్చట.

వేదిక మీద డిజిటల్ ట్యాబ్ లను పంపిణీ చేయకుండా విద్యార్థుల దగ్గరికి వచ్చి నేరుగా వారికి డిజిటల్ ట్యాబ్లను అందించారు. వారితో మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో ఎదుర్కోవాల్సిన సవాళ్లను వారికి వివరించారు. సుమారు లక్ష రూపాయల విలువైన సాఫ్ట్వేర్లను అందిస్తున్నామని వీటిని సద్వినియోగం చేసుకోవాలంటూ వివరించారు. నేరుగా మంత్రి తమతో కలిసి మాట్లాడుతున్నాను విద్యార్థిని విద్యార్థులు సంతోషంలో మునిగిపోయారు.

సేవా కార్యక్రమాల్లో పోటీ పడండి..

అనవసరమైన విషయాల్లో కాకుండా ప్రతిపక్ష పార్టీల నాయకులు సేవా కార్యక్రమాల్లో తనతో పోటీ పడాలని సవాలు విసిరారు. అనవసరమైన విషయాల్లో డబ్బులు ఖర్చు చేయడం వల్ల ఉపయోగం లేదని భవిష్యత్ తరాలకు పనికి వచ్చేలా సేవా కార్యక్రమాలు చేపట్టాలని నాయకులను కోరారు. విద్యార్థులకు సహాయం అందించిన సాఫ్ట్వేర్ కంపెనీ వేదికపై సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ పవర్ లోన్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, నాప్కప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు. కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు