నేటి నంచి వినియోగంలోకి నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ

` సిద్దిపేట జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
` ఫ్యాక్టరీ మా శ్రమ ఫలితం
` కష్టం మాది.. శిలాఫలకాలు విÖవా?
` హరీశ్‌రావు ఆగ్రహం
సిద్దిపేట(జనంసాక్షి):సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట వద్ద నిర్మించిన ఆధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ప్రారంభం తెలంగాణ వ్యవసాయ రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవబోతోంది. సుమారు రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు కొత్త ఊపును ఇవ్వనుంది. మార్చి 22న ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల విÖదుగా ఈ ఫ్యాక్టరీ ప్రారంభం కానుంది. అదే రోజు రాష్ట్ర రైతులకు రైతు భరోసా నిధుల విడుదల కూడా జరగనుంది. ఈ రెండు కార్యక్రమాలు ఒకే వేదికపై జరగడం తెలంగాణ రైతాంగానికి శుభసూచకంగా భావించాలి. ఈ సందర్భంగా నర్మెటలో భారీ ఏర్పాట్లు చేశారు. సిఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల, పొన్నం తదితరులు పాల్గొంటారు. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులకు దీర్ఘకాలిక ఆదాయం కల్పించే పంటగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో నర్మెట్టలో అత్యాధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మించారు. సుమారు 62 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ ఆధునిక సాంకేతికతతో రూపొందించారు. ప్రారంభంలో గంటకు 30 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పనిచేసే ఈ మిల్లు భవిష్యత్తులో 120 మెట్రిక్ టన్నుల వరకు విస్తరించేలా రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తికావడంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. ఆయన తరచుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనుల పురోగతిని సవిÖక్షించారు. అదే విధంగా జంగా రాఘవరెడ్డి నాయకత్వంలో ఆయిల్ ఫెడ్ అధికారులు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రికార్డు సమయంలో పూర్తి చేశారు. ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా మార్చి 20 నుంచి 22 వరకు మూడు రోజులపాటు రైతు మేళా నిర్వహిస్తున్నారు. ఇందులో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రభుత్వ పథకాలు, ఆయిల్ పామ్ సాగులోని మెలకువలపై రైతులకు ప్రత్యక్ష అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. మొదటి విడతగా నర్మెట్టలో జరిగే కార్యక్రమంలో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,590 కోట్లు నేరుగా జమ చేయనున్నారు. అనంతరం మరో 20 రోజుల తర్వాత రూ.2,650 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా మిగిలిన రైతులకు కూడా నిధులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి సుమారు రూ.9,000 కోట్లు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. రైతులు వ్యవసాయరంగంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి .. ఆదాయం బాటలో నడవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు మహోత్సవ మేళా కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్వహిస్తోంది. ఈ మేళాలో వ్యవసాయం, ఉద్యానం, పట్టుపరిశ్రమ, మత్స్యశాఖ, మార్క్‌ఫెడ్, విత్తనాభివద్ధి సంస్థ, చేనేత జౌళి శాఖలతోపాటు విజయడైరీ, సాగు యంత్రాలతో 150 స్టాళను ఏర్పాటు చేశారు. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జనగామ, కరీంనగర్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, వరంగల్, కామారెడ్డి జిల్లాల నుంచి 50 వేల మందికి పైగా పాల్గొంటున్నట్టు జిల్లా వ్యవసాయ అధికారిణి స్వరూపరాణి తెలిపారు.
సోలార్ సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్ యాప్ ద్వారా పొలానికి నీరు అందించే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ’ఆటోపామ’ సంస్థ వారు ఫోన్‌ను వాడుతూ పంటకు నీరు అందించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. బిందు సేద్యంలో పంటకు మందులను సైతం పంపవచ్చు. ఒకసారి ఏర్పాటు చేసుకుంటే పదేళ్ల పాటు వినియోగించుకోవచ్చని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆవిష్కరించిన సవిÖకత వ్యవసాయ ప్రదర్శన ఇది. చిన్న, సన్నకారు రైతులకు ఎంతో లాభదాయకం. 2`3 ఎకరాలు భూమి ఉన్న రైతులు ఒకే పంట కాకుండా వరి, కందులు, మొక్కజొన్న, కూరగాయలు, ఆకుకూరలు, పశుగ్రాసం, కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమ, చేపలు, గొర్రెలు, మేకల పెంపకం చేపట్టవచ్చు. రోజూ ఆదాయం పొందవచ్చని విద్యార్థిని శివాని తెలిపారు. సంప్రదాయ పంటలను సాగు చేసి నష్టాలు చవిచూసిన రైతులకు అధిక దిడుబడులు సాధించే దిశగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిష్కరించిన నూతన వంగడాలు ఇవి. వరి రకాలు తెలంగాణ సోనా, కె.యన్.ఎమ్ 1638, కంది డబ్ల్యూఆర్జీ 255, పెసర ఎం.జి.జి. 385, వేరుశనగ జేసీజీ 2141, ఆముదం పీసీఎస్ 262, తెలంగాణ జొన్న, పాలెం రాగి వంటి సంకర జాతి విత్తనాలను ప్రదర్శించారు.
నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ మా శ్రమ ఫలితం
శ్రమ ఫలితం మాది… శిలాఫలకాలు విÖవా?
కాళేశ్వరంతో వ్యవసాయాన్ని పండగ చేశాం
సెంట్రల్ డ్రగ్ స్టోర్, జిల్లా జైలు, ఆయుష్ ఆస్పత్రి మేం నిర్మించాం
ఒక్కటంటే ఒక్క పనిచేయని రేవంత్
విÖడియా సమావేశంలో మండిపడ్డ ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట(జనంసాక్షి): సిద్దిపేట నియోజకవర్గానికి చేసిన ద్రోహం, నిధుల రద్దుపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని స్తానిక ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. రేవంత్ ప్రారంభించబోయే అభివద్ధి పనుల్లో ఏ ఒక్కటీ కాంగ్రెస్ ఇచ్చిందని లేదని.. అవన్నీ బీఆరఎస్ హయాంలో నిర్మించుకున్నవే అని తెలిపారు. శ్రమ ఫలితం మాది, శిలాఫలకాలు విÖవా? అంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఘాటు విమర్శలు చేశారు. సీఎం రేవంత్ ఆదివారం సిద్దిపేట పర్యటన నేపథ్యంలో పలు ప్రశ్నలు సంధించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మేం అసెంబ్లీలో చేసిన ఒత్తిడితోనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందని హరీశ్ రావు తెలిపారు. మా పోరాటం ఫలితంగానే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం ఆయన విÖడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.సిద్దిపేట జిల్లా నర్మెట్టలో 365 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ’సీఎం రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించే ఆయిల్ ఫ్యాక్టరీ 2021లోనే ప్రారంభించాం. ఈ ఆయిల్ ఫామ్‌కి ప్రాణాధారం కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్న రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలి. కాళేశ్వరాన్ని అడ్డుకోవడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. మొక్కవోని దీక్షతో పూర్తి చేసింది మేము. ఇప్పటికైనా కాళేశ్వరంపై చిల్లర మాటలు మానుకో అని హితవు చెప్పారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేయడంలో అనేక విధాలుగా శ్రమ పడ్డాం. 20 కోట్ల లీటర్ల నీటి నిలువ సామర్థ్యం కలిగిన పాండ్ నిర్మించాం. మలేషియా టెక్నాలజీతో ఇండియాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాం అన్నారు. బీఆరఎస్ కషి ఫలితమే ఆయిల్ ఫ్యాక్టరీ. దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్, జిల్లా జైలు, ఆయుష్ ఆస్పత్రి, రెండు పీహెచ్సీలు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండగా మంజూరు చేసి పూర్తి చేసినవి. వీటికి విÖరు శిలాఫలకం వేసుకుని ప్రారంభిస్తున్నారు. ఇందులో విÖరు చేసిందేవిÖ లేదు. మేము ఆలయాలు, విద్యాలయాలు, రిజర్వాయర్లు, జైళ్లు నిర్మించాం. రూ.78కోట్లతో 30 ఎకరాల్లో జిల్లా జైలు నిర్మించాం. కట్టించింది మేము, శిలాఫలకం విÖరు వేసుకున్నారు. చేసుకో నాకేవిÖ ఈర్ష్య లేదు. కానీ శ్రమ ఎవరిది, శిలాఫలకం ఎవరిది?. కనపడిన ప్రతి దేవుడు విÖద ఒట్టుపెట్టి రుణమాఫీ అన్నారు.. అది ఇప్పటికీ కాలేదు. సిద్దిపేట జిల్లాలో 22వేల మంది రైతులకు రూ.300కోట్ల రుణమాఫీ పెండింగ్‌లో ఉంది. ఒక నర్మేట్టలోనే 350మంది రైతులకు రుణమాఫీ కాలేదు. మా నియోజకవర్గంలో రుణమాఫీ అయ్యింది 48 శాతం, కానిది 52 శాతం. మూడు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టారు. రేపు ఏ రైతు బంధు ఇస్తున్నారో రేవంత్ తెలపాలని డిమాండ్ చేశారు. పంటల బీమా రెండున్నర ఏళ్లుగా చేయలేదు. నష్టపోయిన రైతులకి ఒక్క రూపాయీ పరిహారం ఇవ్వలేదు. వడగళ్ల బాధిత రైతులకు నిధులు విడుదల చేయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క పనీ సిద్దిపేటకు ఇవ్వలేదు. సిద్దిపేటలో జరుగుతున్న రూ.1071 కోట్ల పనులనూ అర్థాంతరంగా రద్దు చేశారు. ఆ నిధులు వెంటనే పునరుద్ధరించాలి. ప్రభుత్వ వెటర్నరీ కాలేజీ, రంగనాయకసాగర్ టూరిజం, శిల్పారామం, స్పోర్ట్స్ స్టేడియం ఇలా అనేక పనులు రద్దు చేశారు. వీటిలో కొన్నిటిని కొడంగల్?కు రేవంత్ ఎత్తుకుపోయారు. ఇది ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా?. ఏ ముఖం పెట్టుకుని సిద్దిపేటకు వస్తున్నారు. విÖరు రద్దు చేసిన గొప్పలు చెప్ప్పుకోవడానికి వస్తున్నావా?’ అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారని హరీశ్‌రావు తెలిపారు. క్వింటాల్‌కు రూ. 2400 మద్దతు ధర ఉంటే.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో నిన్నటిదాకా రైతులు బయట దళారులకు రూ. 1600`1700లకే అమ్ముకుని తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ప్రభుత్వం ముందే ఈ కేంద్రాలను ప్రారంభించి ఉంటే రైతులందరికీ మేలు జరిగేదని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే 20 నుంచి 25 శాతం మొక్కజొన్న దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు. ఇప్పటికైనా రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని సూచించారు. మన ప్రాంతంలో సన్‌ప్లవర్ కూడా బాగా సాగు చేస్తున్నారని.. దానికి కూడా ఈరోజు కొనుగోలు కేంద్రం ప్రారంభించామని హరీశ్‌రావు తెలిపారు. సన్‌ప్లవర్‌కు క్వింటాల్‌కు రూ. 7721 మద్దతు ధర ఉందని.. రైతులు దీన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఆదాయం పొందాలని సూచించారు. సన్‌ప్లవర్ తక్కువ కాలంలో పూర్తయ్యే పంట.. దీనివల్ల అధిక ఆదాయంతో పాటు మంచి దిగుబడి కూడా వస్తుందని అన్నారు. పంట మార్పిడికి కూడా ఇది ఎంతో ఉపయోగకరమని అన్నారు. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ యాసంగిలో మన సిద్దిపేట ప్రాంతంలో ఇంత మంచి దిగుబడి వస్తుందంటే, ఈ స్థాయిలో పంటలు పండుతున్నాయంటే దానికి ఏకైక కారణం కాళేశ్వరం ప్రాజెక్టే అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఒకప్ప్పుడు సిద్దిపేట నియోజకవర్గంలో యాసంగి సాగు కేవలం 8 వేల ఎకరాలు మాత్రమే ఉండేది. కానీ ఇవాళ కాళేశ్వరం జలాల పుణ్యమా అని అది పదింతలు పెరిగి ఏకంగా 80 వేల ఎకరాల్లో యాసంగి సాగు జరుగుతోందని తెలిపారు. 2005వ సంవత్సరంలో కరువు వచ్చిన పరిస్థితులు నాకు ఇంకా బాగా గుర్తున్నాయన్నారు. తాగడానికి నీళ్లు లేక, పశువులకు గడ్డి లేక అల్లాడిపోయామని పేర్కొన్నారు. పశువులను బతికించుకోవడానికి చిన్నకోడూరు, రాజగోపాల్‌పేట, నంగునూరులో పశుగ్రాస కేంద్రాలు పెట్టి ఆంధ్రా నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల గడ్డి తెచ్చి రైతులకు సపెí్ల చేశామని గుర్తుచేశారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చాక సిద్దిపేట దరిదాపుల్లో కరువు అనే మాటే లేదని తెలిపారు. వానలు పడినా, పడకపోయినా కాలంతో సంబంధం లేకుండా రైతులు రెండు పంటలు పండిస్తూ బంగారం లాంటి దిగుబడులు సాధిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఒకప్ప్పుడు కరువుతో అల్లాడిన మన ప్రాంతానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరంలా మారిందని హరీశ్‌రావు తెలిపారు. ఈ ప్రాజెక్టు మన ప్రాంత రూపురేఖలను మార్చేసి, వ్యవసాయానికి కొత్త దిశానిర్దేశర చేసిందని పేర్కొన్నారు. రైతులు ఎవరూ దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల ద్వారానే తమ పంటను అమ్ముకుని ప్రభుత్వ మద్దతు ధరను పూర్తిస్థాయిలో పొందాలని సూచించారు


