నేడు బోయినపల్లి జయంతి వేడుకలు

జగిత్యాల,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): ప్రముఖ స్వాతంత్య సమరయోధుడు, విశ్వబంధు, కరీంనగర్‌ గాంధీ డాక్టర్‌ బోయినపల్లి వెంకటరామారావు 98వ జయంతి వేడుకలు 2న ఆదివారం నిర్వహించనున్నారు. కరీంనగర్‌లోని బోవెరా భవన్‌లో నిర్వహించనున్నట్లు బోవెరా తనయుడు బోయినపల్లి హన్మంతరావు ప్రకటించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ పాల్గొని స్మారక ఉపన్యాసం చేయనున్నారు. ముఖ్య అతిథిగా ప్రముఖ చలనచిత్ర నటుడు, దర్శకులు ఆర్‌.నారాయణమూర్తి పాల్గొననున్నట్లు తెలిపారు. బోవెరా కవితా పురస్కారాన్ని ప్రకృతి కవి, ప్రజా కవి, ప్రముఖ వాగ్గేయకారులు జయరాజ్‌కు అందజేయనున్నట్లు ప్రకటించారు. సభాధ్యక్షులుగా ప్రముఖ చరిత్ర పరిశోధకులు కుర్రా జితేంద్రబాబు వహించనున్నారు. కార్యక్రమానికి కవులు, కళాకారులు, విద్యార్థులు, యువకులు, పెద్దఎత్తున హాజరు అవుతారని అన్నారు. .

——————-