నేడు, రేపు టీఆర్‌ఎస్‌ మేథోమథనం

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి సమరానికి సన్నద్ధమవుతోంది. నాలుగున్నరన కోట్ల ప్రజల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పేందుకు వ్యుహం రచిస్తోంది, పుష్కరకాంలగా ప్రధాన పార్టిల దోబూచులాటలు, మోసాలు, కురిపిస్తున్న కపట ప్రేమలను జనం మధ్యనే ఎండగ సిద్ధమవుతోంది, చర్చలకు అవకాశం ఇచ్చినా కల్లబొల్లి మాటలతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్‌కు, రెండు కళ్ల సిద్దాంతంతో నాన్చుడు ధోరణి అనుసరిస్తూ నమ్మక ద్రోహం చేస్తున్న టీడీపీకి, వెకిలి మాటలు, చేష్టలతో తెలంగాణ ప్రజల గుండెలు మండేలా ప్రవర్తిస్తున్న సీమాంధ్ర నాయకులకు, తెలంగాణ గడ్డపై పుట్టి, పదవుల కోసం పాకులాడుతున్న నేతలకు బుద్ధి చెప్పించే విధంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ప్రణాళికలకు రూపకల్పన చేస్తోంది, ఇందుకోసం పోరాటాల పురిటిగడ్డ కరీంనగర్‌ను వేదికంగా చేసుకుంటోంది. సింహగర్జన నుంచి సకల జనుల సమ్మెవరకు సాగిన ప్రతి కీలక ఘట్టానికి వేదికగా నిలిచిన కరీంనగర్‌..మరోసారి మహోగ్ర ఉద్యమానికి వేదికగా నిలువబోతోంది, తెలంగాణ రాష్ట్ర సమిది రాష్ట్ర కార్యవర్గం, పొలిట్‌బ్యూరో, శాసన సభాపక్షం సంయుక్త మేధోమథన సదస్సు బుధ, గురువారాల్లో ఇక్కడ జరగనుంది. పార్టీ అవిర్భావం తదుపరి తొలిసారిగా హైదరాబాద్‌ వెలుపల ఈ తరహా సమావేశాలను నిర్వహిస్తున్నారు. జిల్లాల కేంద్రంలోని బస్‌స్టేషన్‌ సమీపంలోని ప్రతిమ మల్లిప్టెక్స్‌లో ఈ సమావేశాలు జరగనున్నాయి. వీటి నిర్వహణను కరీంనగర్‌ జిల్లా పార్టీ యంత్రాగం సవాలుగా తీసుకుంది. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుంగా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. తెలంగాణవ్యాప్తంగా 245 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గోనున్నారు. వీరిందరికీ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అతిధులందరికీ స్థానిక తెలంగాణభవన్‌లో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర నాయకులతో పాటు పలువురు ప్రత్యేక  అధితులుగా పాల్గొనున్నారు.

ప్రత్యేక తెలంగాణకోసం పుష్కరకాలంగా టీఆర్‌ఎస& చేస్తున్న పోరాటాలు.. ఇప్పటివరకు సాధించిన ఫలితాలు, ఎదురైన ఇబ్బందులు, ఒడిదుడుకులపై ముందుగా సుదీర్ఘ చర్చచేసే అవకాశం ఉంది, ఇప్పటివరకు ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకొని  భవిష్యత్తు పోరాటానికి వ్యూహరచన జరుగుతుందని టీఆర్‌ఎస్‌ మడమ తిప్పరి పోరాటం చేస్తున్నదని ఆ పార్టీ నేతలు అన్నారరు. లక్ష్య సాధనకు తన  శాయశక్తులా ప్రయాత్నాలు చేస్దోందని చెప్పారు. మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ప్రతి యేటా కొత్తగా ఉద్యమ రుపాలను సంతరించుకొని ముందుకు సాగుతోందని తెలియజేశారు.  ఒకనాడు పార్టీపరంగా బహిరంగ సభలకే పరిమితమైన టీఆర్‌ఎస్‌.. నేడు ప్రజల పార్టీగా మారింది. ప్రజల అకాంక్ష మేరకు తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీల ఏర్పాటుకు కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. వాటి ద్వారా ప్రజలను భాగస్వాములను చేస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపారు. ఈ క్రమంలోనే 2011 సెప్టెంబర్‌లో సకల జనుల సమ్మె జరిగింది. 42 రోజుల పాటు  సాగిన ఈ సమ్మె యావత్తు దేశాన్నేకాక.. ప్రపంచాన్ని సైతం ఆకర్షించింది. ఇలా ఉద్యమాలతో ముందుకు సాగుతున్న టీఆర్‌ఎస్‌ అధినేత .. కాంగ్రెస్‌ పెద్దల కోరిక మేరకు చర్చల నిమిత్తం కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఇక్కడ చర్చలు జరిగినా.. ఆశాజనకంగా లేవని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే అధినేత కేసీఆర్‌ పూర్తి స్థాయిలో చర్చల వివరాలు వెల్లడించలేదన్న అసంతృప్తి శ్రేణుల్లో ఉంది. ఢిల్లీలో జరిగిన చర్చలు, వాటి ఫలితాలు, కాంగ్రెస్‌ స్పందించిన తీరువంటి అంశాలను కేసీఆర్‌ ఈ సదస్సులో శ్రేణులకు విపులంగా వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది, దానిపై పార్టీ ప్రతినిధులనుంచి అభిప్రాయాలు సేకరించాక భవిష్యత్తు వ్యూహరచన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ విలీనం అవుతందని వస్తున్న ఊహాగానాలపైనా కేసీఆర్‌ సృష్టతనిచ్చే అవకాశాలు ఉన్నాయని నేతలు చెబుతున్నారు.