నేడు సభకు సాదారణ బడ్జెట్‌

5

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 28(జనంసాక్షి):రైల్వే బడ్జెట్‌ లో పెద్దగా వడ్డింపులు, వరాలు ప్రకటించని ఎన్డీఏ సర్కార్‌ ను రేపు సాధారణ బడ్జెట్‌ ప్రవేశ పెట్టనుంది. రైల్వే బడ్జెట్‌ తో పోల్చితే సాధారణ బడ్జెట్‌ పై జనాల్లో హై రేంజ్‌ ఎక్స్‌ ఫెక్టేషన్స్‌ ఉంటాయి. ఒకటి రెండు కాదు దేశంలోని అన్ని వర్గాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో బడ్జెట్‌ లో తీసుకునే నిర్ణయాలకు ప్రభావితం కావాల్సిందే. ఇలాంటప్పుడు వీటన్నింటిని సమన్వయం చేస్తూ బడ్జెట్‌ ను రూపొందించటమనేది ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి కత్తివిూద సామే. మరీ ఈ బాధ్యతకు సమర్థవంతంగా నిర్వహించటానికే మంత్రివర్యులు ఏం చర్యలు తీసుకుంటారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. సాధారణ బడ్జెట్‌ అనగానే అందరికన్నా ఎక్కువ ప్రభావితం అయ్యేది కార్పొరేట్‌ సెక్టారే. ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వస్తున్న రంగం కూడా కార్పొరేట్‌ రంగమే. దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే ఈ రంగానికి సంబంధించి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్‌ ప్రారంభం నుంచే కార్పొరేట్‌ లాబీయింగ్‌ కూడా తమకు అనుకూలంగా బడ్జెట్‌ రూపొందించాలని ఆర్థిక మంత్రిపై ఒత్తిడి పెంచుతాయి. ఈ ఏడాది బడ్జెట్‌ లో కార్పొరేట్‌ సెక్టార్‌ ను సంతృప్తి పరిచేందుకు కార్పొరేట్‌ పన్నును 1 శాతం మేర తగ్గించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం 30 శాతంగా ఉన్న కార్పొరేట్‌ పన్నును ఐదేళ్లలో 25 శాతానికి తగ్గించటమే లక్ష్యం. ఇదే సందర్భంలో పన్ను మినహాయింపులను దశల వారీగా ఉపసంహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మేకిన్‌ ఇండియా లక్ష్యం పెట్టుకున్న నేపథ్యంలో పన్నుల మినహాయింపులు చేయటం ప్రభుత్వానికి సవాల్‌ గా మారనుంది.

కార్పొరేట్‌ రంగం తర్వాత?వేతన జీవుల్లోనే బడ్జెట్‌ పై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణం ఆదాయ పన్ను పరిమితి. ప్రస్తుతం ఆదాయ పన్ను పరిమితి 2 లక్షల 50 వేల రూపాయలు ఉంది. దీనిని మూడు లక్షల వరకు పెంచుతారని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గత బడ్జెట్‌ లోనే మూడు లక్షల వరకు మినహాయింపు ఉంటుందని ఆశించినప్పటికీ..కేంద్రం అందరినీ నిరాశపర్చింది. దీంతో ఈసారి తప్పకుండా 3 లక్షల రూపాయల వరకు ఆదాయ పరిమితి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాది నుంచే జి.ఎస్‌.టి బిల్లును ఆమల్లోకి తేవాలని కేంద్రం భావించింది. ఐతే రాజ్యసభలో బిల్లుకు ఆమోదం రాలేదు. జి.ఎస్‌.టి ఆమల్లోకి వస్తే మొత్తం పన్నుల వ్యవస్థ సమూలంగా మారిపోయేది. ఆ అవకాశం లేకపోవటంతో ప్రస్తుతం ఉన్న పన్నుల్లో అన్ని వర్గాలను సంతృప్తి పరచటం ఛాలెంజింగ్‌ తో కూడినదే. మేకిన్‌ ఇండియా పై ఫోకస్‌ చేసిన నేపథ్యంలో కస్టమ్స్‌, ఎక్సైజ్‌, ఫ్రైట్‌ ఛార్జీలు వంటి వాటిని పెంచే అవకాశం లేదు. ఐతే విదేశీ వస్తువుల దిగుమతిని తగ్గించేందుకు దిగుమతి సుంకాలు భారీగానే పెంచే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం. ఇక సర్వీస్‌ ట్యాక్స్‌ ను కూడా పెంచేందుకు ఆర్థిక మంత్రి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోవటం కేంద్రానికి అడ్వంటేజ్‌ గా మారింది. చమురుపై రాయితీ రూపంలో అందిస్తున్న వేలకోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగులుగా ఉంది. వీటిని ప్రధాని మోడీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ లకు మళ్లీంచే అవకాశం ఉంది. ముఖ్యంగా మేకిన్‌ ఇండియా, స్వఛ్చ్‌ భారత్‌ కార్యక్రమాలకు భారీగా నిధులు కేటాయించవచ్చు. రక్షణ, ¬ంశాఖ సహా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. భారత్‌ లో తయారీని ప్రోత్సహించేందుకు యువ పారిశ్రామిక వేత్తలకు ఎక్కువగా రాయితీలు?స్టార్టప్‌ కంపెనీలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తూ?ధరల భారం ఉండకుండా సమాతుకం పాటించాల్సిన అవసరం ఉంది. మొత్తం విూద కేంద్రం ప్రవేశ పెట్టే బడ్జెట్‌ పై మాత్రం అన్ని వర్గాలు ఎంతో ఆశతో ఉన్నాయి.