కుట్రల కత్తుల్ని దాటుతాం.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం
` 42 % రిజర్వేషన్లను ఆమోదించాలని కేంద్రానికి మరోమారు సీఎం రేవంత్ వినతి
` ప్రపంచ నగరాలతో పోటీపడుతూ ముందుకువెళ్తున్నాం
రైతుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
నీటి వాటాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు
కృష్ణ,గోదావరి జలాలను పూర్తిగా వినియోగిస్తాం
మూసీ పునరుజ్జీవంతో హైదరాబాద్ వరదకు పరిష్కారం
హైడ్రాతోనే హైదరాబాద్‌కు రక్షణ
కాళేశ్వరంతో రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసిన గత ప్రభుత్వం
ప్రపంచానికే ఆదర్శంగా తెలంగాణను నిలుపుతాం
సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన
ఆలోచనలో స్పష్టత .. అమలులో పారదర్శకత
రాష్టాన్న్రి అగ్రభాగాన నిలబెట్టే లక్ష్యాంతో పరిపాలన
అధికారం చేపట్టగానే ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించాం
ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలకు పెద్దపీట
3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం
25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ
తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు
డ్రగ్స్‌పై దాడితో మత్తు నుంచి యువతను విముక్తి చేస్తున్నాం..
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన అని, దీనికి చరిత్రే సాక్ష్యం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ.. తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్‌గా నిలబెట్టాం అని చెప్పారు. ద్విముఖ విధానంతో తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. తమ ఆలోచనలో స్పష్టత ఉందని, అమలులో పారదర్శకత ఉందన్నారు. అందరినీ కలుపుకుని, అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని తాము ఎంచుకున్నాం అని సీఎం చెప్పారు. స్వాతంత్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. పోలీసుల గౌరవవందనం స్వకీరంచారు. అంతకుముందు అమరవీరులకు నివాళి అర్పించారు. భారత ప్రజలకు 79వ స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ..దేశ స్వాతంత్యర్ర కోసం తమ జీవితాలు త్యాగం చేసిన మహనీయులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్య పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అహింసే అస్త్రంగా మహా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసింది. మహాత్ముడి సారథ్యంలో బయట శతృవులైన బ్రిటీషర్లపై యుద్ధం గెలిచాం. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం. ఆనాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం కోట్ల మంది భారతీయులను ఐక్యం చేసి, లక్ష్యం వైపు నడిచేలా చేసింది. కేవలం ప్రసంగాలు ఇవ్వడంతోనే సరిపెట్టలేదు, ఆ దిశగా కార్యచరణ తీసుకుని దేశ పురోగతికి బలమైన పునాదులు వేశారు. దృఢమైన ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, గణతంత్ర దేశంగా భారత్‌ను నిలబెట్టడంలో గొప్ప రాజనీతిజ్ఞత ప్రదర్శించారు. పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయ, పారిశ్రామిక, వైజ్ఞానిక, సాంకేతిక రంగాల్లో దేశాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారు. ఆ నాటి స్ఫూర్తిని, ఆ మహనీయుల వారసత్వాన్ని కొనసాగిస్తూ.. తెలంగాణ రాష్టాన్న్రి ప్రపంచంలోనే అగ్రభాగాన నిలబెట్టే లక్ష్యాలతో మేం పరిపాలన సాగిస్తున్నాం. స్వాతంత్యర్ర సిద్ధించే సమయానికి దేశం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉంది. శూన్యం నుండి మన ప్రయాణం మొదలైంది. శిఖరాలే లక్ష్యంగా సంకల్పం తీసుకుని మన పెద్దలు ఈ దేశాన్ని ముందుకు నడిపించారు. ఈ రోజు మనం చూస్తున్న ఆధునిక భారతం ఐదేళ్లలోనో, పదేళ్లలోనో సాధించిన విజయం కాదు. దీని వెనుక 79 ఏళ్ల కఠోర శ్రమ ఉంది. ఎందరో గొప్ప నాయకుల త్యాగం, చెమట, రక్తం ఉంది. ఈ సుదీర్ఘ ప్రస్థానం తర్వాతే నేడు మనం ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్నాం. వారు అందించిన ఈ ఘనమైన వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడం మన ముందున్న కర్తవ్యం. ఆ బాధ్యత నిర్వర్తించడంలో నేను సదా సిద్ధంగా ఉంటాను. ఆ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని సీఎం రేవంత్ చెప్పారు. 2023 డిసెంబర్ 7న మేము బాధ్యతలు స్వీకరించగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకున్నాం. రైతులు, మహిళలు, యువత భవితకు పెద్దపీట వేశాం. సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. కుల గణనతో బలహీనవర్గాల వందేళ్ల కలను నిజం చేశాం. ఎస్సీ వర్గీకరణతో దశాబ్ధాల నిరీక్షణకు తెరదించాం. ఇవి గొప్ప నిర్ణయాలు మాత్రమే కాదు.. అత్యంత సాహసోపేత నిర్ణయాలు కూడా. ఒక వైపు ప్రపంచ నగరాలతో పోటీ-పడే లక్ష్యాలు నిర్దేశించుకున్నాం. మరో వైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. ద్విముఖ విధానంతో మా ప్రభుత్వం పాలన సాగిస్తోంది. మా ఆలోచనలో స్పష్టత ఉంది, అమలులో పారదర్శకత ఉంది. అందరినీ కలుపుకుని, అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని మేం ఎంచుకున్నాం. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్ గా నిలబెట్టాం. సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన, దీనికి చరిత్రే సాక్ష్యం. 70 ఏళ్లుగా పీడీఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీని ప్రారంభించింది. 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. ఈ రోజు ధనికులతో సమానంగా పేదవారు సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారు. ఇది కేవలం ఆకలి తీర్చే పథకం కాదు.. ఆత్మగౌరవాన్ని చాటి చెప్పే పథకం. ఈ పథకం అమలు తీరును నేను స్వయంగా పర్యవేక్షించా. ఆ రోజు వారి కళ్లలో కనిపించిన ఆనందం, ఆత్మగౌరవం నాకు శాశ్వతంగా గుర్తుంటుంది. రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక. ఒక భరోసా.. భావోద్వేగం. ఆ భరోసా కోసం రాష్ట్ర ప్రజలు పదేళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. ప్రజా ప్రభుత్వం వచ్చాకే ఆ ఎదురుచూపులకు పరిష్కారం లభించింది. ఈ ఏడాది జూలై 14 నుంచి రాష్ట్రం వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం. పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోంది. పాడుబడి, మూతబడిన రేషన్ షాపుల తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. పేదవాడి ఆశలు, ఆకలి తీర్చే భరోసా కేంద్రంగా నేడు గ్రామాల్లో రేషన్ షాపు పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఇది మేం తెచ్చిన మార్పు’ అని సీఎం తెలిపారు. తెలంగాణ రైతుకు 2022 మే 6న వరంగల్ వేదికగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మేం మాట ఇచ్చాం. గత ఏడాది ఇదే ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి కొత్త చరిత్ర రాశాం. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్నా.. రైతుల విషయంలో రాజీ పడలేదు. తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి, దేశంలో అత్యధిక పంట పండిచే దిశగా ప్రోత్సహించాం. ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించాం. కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు- రైతుల ఖాతాల్లో వేశాం. రాష్ట్రంలోని 70 లక్షల 11 వేల 184 మంది రైతులకు ఈ సాయం అందించాం. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టు-బడి సాయం అందించాం. పండిరచిన పంటను కొనుగోలు చేస్తూ మేం ఉన్నామన్న భరోసా ఇస్తున్నాం. 7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు- చేసి చివరి గింజ వరకు ధాన్యం కొన్నాం. సన్నాలకు
క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. దీని కోసం రూ.16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తున్నాం. ఇది రైతుల పట్ల, వ్యవసాయం పట్ల మాకున్న చిత్తశుద్ధి. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగ రాశాం. అన్నదాతల సంక్షేమానికి రూ.1 లక్ష 13 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశాం. తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. దీనికి రూ.22,500 కోట్లు- వెచ్చిస్తున్నాం. రాష్ట్రంలోని నాలుగు ఐటీ-డీఏ ప్రాంతాల్లో 22,016 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. సామాజిక న్యాయం కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉంది. స్థానిక సంస్థలలో, విద్యా, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించుకున్నాం. 50 రోజుల పాటు- సమగ్ర కులగణనను యజ్ఞంలా చేపట్టాం. దీని ఆధారంగా వారికి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. రాష్ట్ర శాసన వ్యవస్థ ఆమోదించిన ఈ బిల్లులను ఆమోదించి, రిజర్వేషన్ల అమలుకు సహకరించాలని కేంద్రానికి పంపాం. మనం పంపిన బిల్లులపై సత్వరం నిర్ణయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మరోసారి డిమాండ్ చేస్తున్నాం. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీల్లో ఉన్న 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించాం. ప్రతి ఏటా ఫిబ్రవరి 4ను ’తెలంగాణ సోషల్ జస్టిస్ డే’ గా జరుపుకోవాలని నిర్ణయించాం. మసకబారిన ఆరోగ్య శ్రీ పథకానికి పూర్వవైభవం తెచ్చాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 నుండి 10 లక్షలకు పెంచాం. 27 ఎకరాల విస్తీర్ణంలో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆస్పత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య రంగంపై 16 వేల 521 కోట్ల రూపాయలు వ్యయం చేశాం. మహిళా ఉన్నతి-తెలంగాణ ప్రగతి అనే నినాదంతో కోటి మంది ఆడబిడ్డలను కోటీ-శ్వరులను చేయాలన్న లక్ష్‌యంతో మేం పని చేస్తున్నాం. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మీ పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించాం. ఈ పథకం కింద ఆడబిడ్డలకు రూ.6790 కోట్లు- ఆదా అయ్యింది. ఇటీ-వలే 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటడం మా విజయాలలో మరో మైలురాయి. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం మా ప్రభుత్వం మొత్తంగా 46,689 కోట్లు- సమకూర్చింది. యువత తెలంగాణ శక్తికి ప్రతీక. గడచిన పదేళ్లలో యువతను మత్తుకు బానిసలను చేసే కుట్ర జరిగింది. ఆ కుట్రను మేం చేధించాం. ఇవ్వాళ తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినబడటానికి వీలు లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నాం. 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం’ అని సీఎం చెప్పుకొచ్చారు.
విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకతే ప్రధానం
` పెట్టుబడుల కోసం తిరుగుతూ..సొంతవారిని వదులుకోం
` క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్
హైదరాబాద్(జనంసాక్షి):ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని, అప్పుడే అభివృద్ధి పరుగులు పెడుతుందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. మూడు రోజుల పాటు- ఈ ప్రాపర్టీ షో కొనసాగనుంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. శతాబ్దాలుగా సాగిన హైదరాబాద్ అభివృద్ధిలో ఎంతో మంది పాత్ర ఉందన్నారు. పాలకులు మారినా పాలసీ పెరాలసిస్ లేకపోవడంతో అభివృద్ధి కొనసాగిందని చెప్పారు. రాష్టాభ్రివృద్ధిని పణంగా పెట్టే ఎలాంటి నిర్ణయాలను ఈ ప్రభుత్వం తీసుకోదు. పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు.. లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత నాది. దేశ విదేశాలు తిరుగుతూ పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నాం. స్వదేశీ పెట్టుబడుల విషయంలో కొందరు అపోహలు సృష్టిస్తున్నారు. విదేశీ సంస్థలను ప్రోత్సహించిన మేము.. ఈ దేశ వాసులను ఎందుకు ప్రోత్సహించమో ఆలోచించాలని అన్నారు. నేను మధ్యతరగతి మనస్తత్వం ఉన్న వ్యక్తిగా ఆలోచిస్తాను. ప్రజల సంపద కొల్లగొట్టి విదేశాలకు తరలించి దాచుకునే ఆలోచన నాకు లేదు. గత ప్రభుత్వం అధిక వడ్డీ రేట్లకు భారీగా రుణాలు తెచ్చింది. మేం పాత రుణాలను తక్కువ వడ్డీ రేట్లకు రీషెడ్యూల్ చేయించాం. మెట్రో రైలు విస్తరణ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. మహారాష్ట్రలో 40 విమానాశ్రయాలుంటే.. మనకు ఒక్కటే ఉంది. గత ప్రభుత్వం కొత్త విమానాశ్రయాల గురించి పట్టించుకోలేదు. మేం కేంద్రాన్ని ఎన్నోసార్లు సంప్రదించి రెండు విమానాశ్రయాలు సాధించాం. త్వరలోనే వరంగల్, ఆదిలాబాద్‌కు విమానాశ్రయాలు సాధిస్తాం. రీజినల్ రింగ్‌రోడ్డు, రీజినల్ రింగ్‌రోడ్డు రైలు రింగ్ కోసం కృషి చేస్తున్నామని రేవంత్ తెలిపారు. విదేశీ సంస్థలను ప్రోత్సహించిన తాము.. ఈ దేశ, రాష్ట్ర సంస్థలను ఎందుకు ప్రోత్సహించమో ఆలోచించాలన్నారు. మిమ్మల్ని ఎందుకు వదులుకుంటాం అని, అపోహలు సృష్టించే వాళ్లతో ప్రయాణిస్తే ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని, అప్పుడే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. పెట్టు-బడులకు రక్షణ కల్పించడమే కాదు, లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత తనది అని సీఎం హావిూ ఇచ్చారు. ప్రతీ వ్యక్తిని సంతోష పెట్టకపోవచ్చు. నేను మధ్యతరగతి ఆలోచన ఉన్న వాణ్ణి, ఉన్నంతలో సర్దుకుపోయే తత్వం నాది. నేను ఓపెన్ మైండ్తో ఉన్నా. నాకు 10 ఆప్షన్స్.. విూకు ఒకటే ఆప్షన్. వైఎస్ ఔటర్ వేసినప్పుడు కూడా ఆరోపణలు చేశారు, అపోహలు సృష్టించారు. ఎవరు ఏం ఆలోచన చేసినా దాని వెనక ఎవరో ఒకరు బెనిఫిట్ అవుతారు. ఫోర్త్ సిటీ- అంటే.. కొందరు ఫోర్ బ్రదర్స్ అంటున్నారు. విూరే కదా నా ఫోర్ బ్రదర్స్. మెట్రో విస్తరణ చేయకపోవడం వల్ల పదేళ్లు వెనక పడ్డం. డిల్లీ పోతున్నారు అని లెక్కలు వేస్తున్నారు. అనుమతులు ఇచ్చే వారు డిల్లీలోనే కదా ఉన్నది. సీఎంకి డిల్లీలో బంగ్లా ఎందుకు ఇచ్చారు. ఫార్మ్ హౌస్ లాగ వాడటానికి ఇవ్వలేదు’ అని అన్నారు. కాళేశ్వరం కోసం 11.50కి వడ్డీకి అప్పులు తెచ్చారు. మనం తెస్తమా..?. కాళేశ్వరంపై తెచ్చిన అప్పులో 29 వేల కోట్ల అప్పు కట్టిన ఇప్పటి వరకు. డెట్ రిస్ట్రాక్షన్ర్ ఇవ్వండి అని అడిగా. ప్రధాని మోదీతో మాట్లాడి 7.5 ఇంట్రెస్ట్ కి తగ్గించా. అది నా కమిట్‌మెంట్. జపాన్లో ఏ కంపెనీతో మాట్లాడినా పోర్ట్ కనెక్టివిటీ- అడుగుతున్నారు. 45 కివిూ మేర రింగ్ రోడ్డు ఉంది, 11 రేడియల్ రోడ్డులు ప్లాన్ చేస్తున్నాం. హైడ్రా ఎందుకు తెచ్చాం. చెరువులు మనమే మూసేస్తిమి. నీళ్ళు ఇంట్లకు రాకుంటే ఎటు- పోతాయి. యుద్ధం వచ్చినప్పుడు సైనికులే కాదు.. అక్కడక్కడ సామాన్యులు కూడా చనిపోతారు’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
రాజ్‌భవన్ ఎట్‌హోమ్‌కు సీఎం రేవంత్ హాజరు
హైదరాబాద్(జనంసాక్షి):స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇచ్చిన తేనీటి విందుకు సీఎం రేవంత్‌రెడ్డి , డిప్యూటీ- సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు- పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన వారి వద్దకు గవర్నర్, సీఎం వెళ్లి పలకరించారు. ఏటా స్వాంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇలా కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.