బనకచర్లతో ఏ రాష్టాన్రికీ అన్యాయం జరగదు
` ప్రాజెక్టుపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు
` ఎగువ నుంచి వరదను,బురదను భరిస్తున్నాం
` అదే సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వాడుకుంటే తప్పేంటి?
` రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం
` పరోక్షంగా తెలంగాణను ఉద్దేశించి పంద్రాగస్టు వేడుకల్లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
విజయవాడ(జనంసాక్షి):పంద్రాగస్టు వేడుకల్లో బనకచర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్లతో ఏ రాష్టాన్రికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. బనకచర్లపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని.. సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వాడుకుంటాం అని అన్నారు. విజయవాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లోమాట్లాడుత..ఎగువ రాష్టాల్ర వరద నీటితో నష్టాలనూ భరిస్తున్నామని.. అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరమేంటి? అని పరోక్షంగా తెలంగాణ సర్కార్‌కు ప్రశ్నను సంధించారు. వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకోవద్దా? అని నిలదీశారు. కాగా రాయలసీమను నీటితో సశ్యశామలంగా చేసేందుకు బనకచర్ల ప్రాజెక్ట్ ను నిర్మిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి తెలంగాణ సర్కార్ నో చెప్పడంతో వివాదం రాజుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ-ఆంధప్రదేశ్ రాష్టాల్ర్ర మధ్య వివాదం నడుస్తూనే ఉంది.. అయితే, స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. బనకచర్లతో ఎవరికీ నష్టం జరగదు.. గోదావరి వృథా జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం.. బనకచర్ల ద్వారా గోదావరి వృథా జలాలు రాయలసీమకు మళ్లించాలని నిర్ణయించాం అన్నారు.. సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వినియోగిస్తాం.. ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.. సముద్రంలోకి వృథా అవుతున్న నీటిని బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా వినియోగించుకుంటే తెలంగాణకి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్టాల్ర్రు నీటిని విడుదల చేస్తే కష్టనష్టాలు భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలెందుకు? 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. రాయలసీమలో సాగునీరు అందించే ఐకాపై గత ప్రభుత్వ నాటకం ఆడిరదని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే 3,850 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇస్తూ 2026 జులై నాటికి నీరు ఇస్తామని తెలిపారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు పోలవరం నుంచి బనకచర్లకు నీరు అందిస్తాం అని ప్రకటన చేశారు. మిగులు జలాలను, వరద నీటిని ఉపయోగించుకుంటామని.. వరదను బరించాలి అయితే వాటిని వాడకూడదు అంటే ఎలా అని ప్రశ్నించారు. 785టిఎంసి నీళ్లు వివిధ రిజర్వాయర్ లలో నిల్వ ఉన్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.12,157 కోట్ల నిధులు విడుదల చేసింది. నిధుల విడుదలతో సకాలంలో పనులకు కేంద్రం సహకరించింది. 2028 నాటికి ’జల జీవన్ మిషన్’ కింద ప్రతి గడపకు సురక్షిత తాగునీరు అందిస్తాం. గ్రావిూణ ప్రాంతాల్లో 4 వేల కి.విూ సీసీ రోడ్లు, 250 కి.విూ బీటీ- రోడ్లు నిర్మించాం. ఆరోగ్యాంధప్రదేశ్ విధానంతో వైద్య శాఖను తీర్చిదిద్దాం. సీఎం సహాయనిధి నుంచి ఇప్పటి వరకూ రూ.552 కోట్లు- అందించాం. భవన నిర్మాణాలకు అనుమతులు సులభతరం చేశాం. వంద గజాల్లోపు స్థలాల్లో ఎలాంటి బిల్డింగ్ ప్లాన్ లేకుండానే ఇంటి నిర్మాణలకు అవకాశం కల్పించాం అని అన్నారు.