అమెరికా ఒత్తిళ్లకు,పాక్‌ బెదిరింపులకు భయపడం

భారత్‌ను రక్షించేందుకు సిద్ధంగా ‘మిషన్‌ సుదర్శన్‌ చక్ర’
` ఎర్రకోట వేదికగా ప్రకటించిన ప్రధాని మోదీ
` ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌ను దెబ్బతీసాం
` దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త పథకం
` త్వరలో మేడ్‌ ఇన్‌ ఇండియా చిప్‌లు
` జీఎస్టీలో కొత్త తరం సంస్కరణలు
` సింధూ జలాలపై చర్చల ప్రసక్తే లేదు..
` అణు ఇంధనంలో ప్రైవేటు పెట్టుబడులు
` ప్రపంచ మార్కెట్‌ను పాలించాలి..
` ` ఎర్రకోటపై జెండా ఆవిష్కరించిన ప్రధాని
న్యూఢల్లీి(జనంసాక్షి):రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకొంది. భారత్‌ను ఎలాంటి ముప్పు నుంచైనా రక్షించేందుకు వీలుగా మిషన్‌ సుదర్శన్‌ చక్రను ప్రధాని మోదీ ప్రకటించారు. వచ్చే పదేళ్లలో దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేయనున్న ఈ వ్యవస్థ కీలక ప్రదేశాలను కాపాడనుంది. 79వ స్వాతంత్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని..ఇటీవలి ఆపరేషన్‌ సిందూర్‌, జిఎస్టీ, యువత కోసం కొత్త పథకం వంటి అనేక విషయాలను ప్రస్తావించారు. ఇది 140 కోట్ల మంది సంకల్ప పండగ అని, 75 ఏళ్లుగా రాజ్యాంగం మనకు మార్గదర్శనం చేస్తోందని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశ 79వ స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని … శుక్రవారం ప్రధాని మోడి న్యూఢల్లీిలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. దీనికిముందుగా త్రివిధ దళాల నుంచి ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు. రాజ్‌ఘాట్‌ వద్ద నివాళి అర్పించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ …. ఇది సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయం అని అన్నారు. కోట్ల మంది త్యాగాలతో మనకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. 75 ఏళ్లుగా రాజ్యాంగం మనకు మార్గదర్శనం చేస్తోందని, రాజ్యాంగ నిర్మాతల సేవలు మరువలేనివి అని అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన వీరజవాన్లకు సెల్యూట్‌ చేస్తున్నామన్నారు. మన సైనికులు ఊహకందనంత దారుణంగా శత్రువులను దెబ్బతీశారని ప్రశంసించారు. పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పాం అని మోడీ అన్నారు. సుదర్శన చక్రం గురించి వివరిస్తూ..ప్రతి పౌరుడు దీని కింద సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారని ప్రధాని భరోసా ఇచ్చారు. మహాభారతంలోని శ్రీ కృష్ణుడి స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో దేశంలోని కీలకమైన మౌలిక వసతులను ముప్పు నుంచి రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో సాంకేతికత అభివృద్ధి విదేశాలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తోందన్నారు. 2008 ముంబయి దాడులు సవిూకృత భద్రతా ప్రణాళిక అవసరాలను పెంచాయన్నారు. దేశంపై దాడులు జరిగినప్పుడు మాత్రమే స్పందించేలా కాకుండా.. ముందే సంసిద్ధతతో ఉండాలన్నారు. పదేళ్ల క్రితం రక్షణరంగంలో స్వయంసమృద్ధిపై మన దేశం దృష్టిపెట్టిందని.. ఇప్పుడు దాని ఫలితాలను చూస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రసంగం ముగిసిన అనంతరం ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలలను కలిశారు. సుదర్శన్‌ చక్రను బహుళ అంచెల భద్రతా వ్యవస్థగా భావిస్తున్నారు. అత్యాధునిక నిఘా, సైబర్‌, పలు కీలక ప్రదేశాల రక్షణలు ఇందులో ఉండనున్నాయి. దీనిలో ప్రభుత్వ రక్షణ పరిశోధన సంస్థలు, ప్రైవేటు- కంపెనీల భాగస్వామ్యం ఉండనుంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమాన్ని ముందుకుతీసుకెళ్లేలా ఇది ఉండనుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్‌, హైబ్రీడ్‌ యుద్ధ తంత్రాలు, వెన్నుపోటు- వ్యూహాల అమలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని ప్రకటన రావడం గమనార్హం. దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త ప్రణాళిక రూపొందించినట్లు- ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన కింద అమలుచేయనున్నామని చెప్పారు. ప్రైవేటు- కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు ప్రభుత్వం తరఫున నెలకు రూ.15వేలు అందించనున్నట్లు- చెప్పారు. అనేక సవాళ్లు ఎదుర్కొన్న భారత్‌.. నేడు స్వయంసమృద్ధి దిశగా నడుస్తోంది. తిండిగింజల కోసం ఇబ్బందిపడిన దేశం.. నేడు ప్రపంచానికి ఎగుమతి చేస్తోంది. ప్రతి రంగంలోనూ స్వయంసమృద్ధి వైపు అడుగులు వేస్తోన్న భారత్‌, ఎన్ని ఇబ్బందులొచ్చినా వెనకడుగు వేసేదే లేదని ప్రధాని స్పష్టం చేశారు.స్వయంసమృద్ధి అంటే డాలర్లు, పౌండ్లు కాదు. సమున్నతంగా నిలబడటం. ఎగుమతి, దిగుమతులు, ఆదాయ వ్యయాలే స్వయంసమృద్ధి కాదు. మేకిన్‌ ఇండియా ఏంటో ఆపరేషన్‌ సిందూర్‌ చాటి చెప్పింది. భారత్‌లో తయారీ నినాదం రక్షణరంగంలో మిషన్‌ మోడ్‌లో పనిచేస్తోంది. భారత్‌ సమున్నత శక్తిగా ఎదుగుతోంది. ఇవాళ ప్రపంచం భారత్‌ను విస్మరించలేదు. టెక్నాలజీ కోసమో, సాయం కోసమో భారత్‌ ప్రపంచాన్ని అర్థించట్లేదు. సెవిూ కండక్టర్లు సహా అనేక విషయాల్లో సొంత కాళ్లపై నిలబడుతోంది. 50-60 ఏళ్ల క్రితమే వీటి తయారీ ఆలోచన ఉంది. త్వరలో మేడ్‌ ఇన్‌ ఇండియా చిప్‌లు మార్కెట్‌ను ముంచెత్తనున్నాయని మోదీ వివరించారు. అన్ని రంగాల్లో సంస్కరణలు తెస్తున్నాం. జీఎస్టీపై రాష్టాల్ర్రతో చర్చించి మార్పులు, చేర్పులు చేస్తున్నాం. దీపావళి కానుకగా జిస్టీలో మార్పులు తెస్తామని అన్నారు. ’ భారత యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త ప్రణాళిక తెస్తామని మోడీ తెలిపారు. దీనికి ప్రధానమంత్రి వికసిత్‌ భారత్‌ యోజన అని పేరు పెట్టినట్లు- వెల్లడిరచారు. జీఎస్టీపై రాష్టాల్ర్రతో చర్చించి మార్పులు చేర్పులు చేస్తున్నామన్నారు. ఇందులో కొత్తతరం సంస్కరణలు దీపావళి లోపు వస్తాయని, వీటిని సామాన్యులకు దీపావళి కానుకగా ఇస్తామని మోడీ అన్నారు.
దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త పథకం
దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త ప్రణాళిక రూపొందించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన కింద అమలుచేయనున్నామని చెప్పారు.79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. ప్రైవేటు కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు ప్రభుత్వం తరఫున నెలకు రూ.15వేలు అందించనున్నట్లు చెప్పారు. ‘’అనేక సవాళ్లు ఎదుర్కొన్న భారత్‌.. నేడు స్వయంసమృద్ధి దిశగా నడుస్తోంది. తిండిగింజల కోసం ఇబ్బందిపడిన దేశం.. నేడు ప్రపంచానికి ఎగుమతి చేస్తోంది. ప్రతి రంగంలోనూ స్వయంసమృద్ధి వైపు అడుగులు వేస్తోన్న భారత్‌, ఎన్ని ఇబ్బందులొచ్చినా వెనకడుగు వేసేదే లేదు’’ అని పీఎం స్పష్టం చేశారు.‘’స్వయంసమృద్ధి అంటే డాలర్లు, పౌండ్లు కాదు. సమున్నతంగా నిలబడటం. ఎగుమతి, దిగుమతులు, ఆదాయ వ్యయాలే స్వయంసమృద్ధి కాదు. మేకిన్‌ ఇండియా ఏంటో ఆపరేషన్‌ సిందూర్‌ చాటి చెప్పింది. భారత్‌లో తయారీ నినాదం రక్షణరంగంలో మిషన్‌ మోడ్‌లో పనిచేస్తోంది. భారత్‌ సమున్నత శక్తిగా ఎదుగుతోంది. ఇవాళ ప్రపంచం భారత్‌ను విస్మరించలేదు. టెక్నాలజీ కోసమో, సాయం కోసమో భారత్‌ ప్రపంచాన్ని అర్థించట్లేదు. సెమీ కండక్టర్లు సహా అనేక విషయాల్లో సొంత కాళ్లపై నిలబడుతోంది. 50-60 ఏళ్ల క్రితమే వీటి తయారీ ఆలోచన ఉంది. త్వరలో మేడ్‌ ఇన్‌ ఇండియా చిప్‌లు మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి’’ అని మోదీ వివరించారు.
‘’అన్ని రంగాల్లో సంస్కరణలు తెస్తున్నాం. జీఎస్టీపై రాష్ట్రాలతో చర్చించి మార్పులు, చేర్పులు చేస్త్న్న్షుం. జీఎస్టీలో కొత్త తరం సంస్కరణలు దీపావళి లోపు వస్తాయి. సామాన్యులకు కొత్త జీఎస్టీ సంస్కరణలు దీపావళి కానుకగా ఇస్తాం. సామాన్యులపై భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అని మోదీ పేర్కొన్నారు.
సింధూ జలాలపై చర్చల ప్రసక్తే లేదు..
అమెరికా సుంకాల బెదిరింపుల నేపథ్యంలో పౌరులను ఉద్దేశిస్తూ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్‌లో మన సామర్థ్యం నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.‘చరిత్రను లిఖించాల్సిన సమయం ఇది. మనం ప్రపంచ మార్కెట్‌ను పాలించాలి. ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవాలి. నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్‌లో మన సామర్థ్యం నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తక్కువ ధర, అధిక నాణ్యత అని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆర్థిక స్వార్థం పెరుగుతోంది. మన లక్ష్యాలను చేరుకోవడానికి ముందుకుసాగాల్సిన సమయం ఇది’ అని మోదీ పేర్కొన్నారు. మన శక్తిని ఇతరులను తక్కువ చేసి మాట్లాడటంలో వృథా చేయకూడదని సూచించారు. మనల్ని మనం బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారించాలన్నారు. దేశంలోని వ్యాపారులు, దుకాణదారులు స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టిపెట్టాలన్నారు. ప్రపంచం మన పురోగతిని గమనిస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలతో మార్పులు అవసరమైతే తెలియజేయాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక విధానాలను సహించేది లేదన్నారు. రైతులు మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో తోడ్పడతారన్న మోదీ.. అన్ని సందర్భాల్లో వారికి అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. ఇంధనం విషయంలోనూ దేశాన్ని స్వయంసమృద్ధి వైపు నడిపించాల్సి ఉందని మోదీ పేర్కొన్నారు. సోలార్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ వైపు దేశం నడవాల్సి ఉందన్నారు. అణుఇంధనం వైపు కూడా దేశం వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు. అణు విద్యుత్‌లో ప్రైవేటు పెట్టుబడులను కూడా ఆహ్వానిస్తున్నట్లు వెల్లడిరచారు. డీజిల్‌, పెట్రోల్‌ దిగుమతులపై రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని, కొత్త ఇంధనాల అభివృద్ధితో పెట్రోలియం దిగుమతులు తగ్గించాలనేది లక్ష్యమన్నారు. దిగుమతులు తగ్గితే స్వయంసమృద్ధి సాధ్యమని, నేడు ప్రపంచమంతా కీలక ఖనిజాల చుట్టే తిరుగుతోందన్నారు.79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అత్యధిక సమయం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధానిగా మోదీ ఘనత సాధించారు. ఈ రోజు జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం.. 103 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించారు. గతేడాది ఇదే రోజున 98 నిమిషాల పాటు మాట్లాడారు.
సింధూ జలాలపై చర్చల ప్రసక్తే లేదు..
‘’ఉగ్రవాదం మానవాళి మనుగడకే ముప్పు. పహల్గాంలో మతం పేరుతో దాడి చేసిన ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పాం. యావత్‌ దేశం ఆగ్రహంతో రగిలిపోయింది. దానికి సమాధానంగానే ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టి శత్రువును ఊహించని రీతిలో దెబ్బకొట్టాం. శత్రుమూకలను ఎప్పుడు ఎలా మట్టుబెట్టాలో సైన్యం నిర్ణయిస్తుంది. లక్ష్యం, సమయం ఎంచుకునే స్వేచ్ఛ త్రివిధ దళాలకే ఇచ్చాం.అణుబాంబు బెదిరింపులకు భారత్‌ భయపడదనే విషయాన్ని తేల్చి చెప్పాం. నీరు, రక్తం కలిసి ప్రవహించవని మళ్లీ చెబుతున్నా. సింధూ జలాల ఒప్పందంపై మరో మాట లేదు. వాటిని భారత భూభాగానికి మళ్లించాలన్న ఆలోచనలో మార్పు లేదు. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు వాటిని తరలిస్తాం. వాటిపై సంపూర్ణాధికారం భారత్‌ది, భారత రైతులది మాత్రమే. ఆ ఒప్పందం పునరుద్ధరణ ఇక ఎప్పటికీ జరగదు. దీనిపై ఎప్పటికీ చర్చల ప్రసక్తే లేదు’’ అని ఎర్రకోట వేదికగా పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ స్పష్టంచేశారు.

భారత్‌కు ప్రపంచ దేశాల శుభాకాంక్షలు..!
న్యూఢల్లీి(జనంసాక్షి):భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా, సింగపూర్‌, మాల్దీవుల నుంచి సందేశాలు అందాయి.భారత్‌తో తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకొంటామని ఈ సందర్భంగా ఆయా దేశాధినేతలు, మంత్రులు పేర్కొన్నారు.‘’తమ 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సగర్వంగా నిర్వహించుకుంటున్న భారత ప్రజలకు అమెరికా ప్రజల తరఫున శుభాకాంక్షలు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌, ప్రపంచంలో పురాతన ప్రజాస్వామ్యమైన యూఎస్‌ల మధ్య చారిత్రాత్మక సంబంధం కొనసాగుతోంది. భారత్‌, అమెరికా సంబంధాలు ఎంతో దృఢమైనవి. ఇరుదేశాలు మరింత శక్తిమంతమైన ఒప్పందాలను చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్నాయి’’ – అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ‘’భారత ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. న్యూదిల్లీ సామాజిక-ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, ఇతర రంగాలలో విజయాన్ని సాధిస్తూ.. వేగవంతంగా ముందుకు సాగుతోంది. ప్రపంచ వేదికపై తగిన గౌరవాన్ని పొందుతోంది. అంతర్జాతీయ ఎజెండాలోని కీలక సమస్యలను పరిష్కరించడంలో చురుకుగా వ్యవహరిస్తోంది. భారత్‌తో ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విలువైనదిగా భావిస్తున్నాం. మా ఉమ్మడి ప్రయత్నాల ద్వారా బహుళ రంగాలలో నిర్మాణాత్మక, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం’’ -రష్యా అధ్యక్షుడు పుతిన్‌..‘’భారత్‌కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత్‌, ఇజ్రాయెల్‌ల మధ్య ఉన్న స్నేహబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం’’ – ఇజ్రాయెల్‌ ఎంబసీ..‘’భారత ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. న్యూదిల్లీ మాల్దీవులకు ఎల్లప్పుడూ విశ్వసనీయ అభివృద్ధి భాగస్వామిగా ఉంటుంది. ఇరుదేశాల మధ్య ఉన్నత స్థాయి సంబంధాలు మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నాం’’ – మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు..‘’భారత ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వారం ప్రారంభంలో న్యూదిల్లీతో జరిపిన చర్చలు ఇరుదేశాల బంధాన్ని మరింత బలోపేతం చేశాయి. మరిన్ని దౌత్య సంబంధాల కోసం ఎదురుచూస్తున్నాం’’ – సింగపూర్‌ విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌..దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుక కోసం ఎర్రకోట పరిసరాల్లో 11 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ‘నయా భారత్‌’ ఇతివృత్తంతో ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించారు.