నేల రాలిన అరుణ తారలు

గోధుమ రంగు నీటితో మంజీర పచ్చని చెల్ల మంధ్య పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. మానేరుకు తూర్పున ఓరుగంటి సుదర్శన్‌,రవిలు నాటిన విత్తనాలు మొలకెత్తి వృక్షాలై చల్లని గాలై వీస్తు సుడిగాలిని సృష్టిస్తున్నాయి. దోర, భూస్వాములకు దడ పుట్టిస్తుంది. దున్నే వారి చేతిలో ఉండాల్సిన భూ తల్లి,  దొర, భూస్వాముల చేతిలో బందీగా ఉన్నది. కూలీలు మోకాలు లోతు బురదలో నడుంవంచి నాట్లు వేస్తు, కలుపు తీస్తు, వరి మొతలు మొస్తు పుట్లకొలది పంటను పండిస్తు పూటపూటకు కడుపు మాడ్చుకుంటూ అలసి సొలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న వేళలో మొలకలు వృక్షాలై వృక్షాల నుండి వచ్చే చల్లటి గాలిలో సేదతీరుతున్నారు. పొలంలో నడుంవంచిన కూలీలు పల్లె పాటలు పాడుకుంటూ, బతుకు మాటలు చెప్పుకుంటూ పనిలో నిమగ్నమైపోయారు. పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టం చేసినా కడుపునిండదు, పూటపూటకు బతుకు సుడిగుండం వలే ఉందంటు కూలీ జనులంతా  ఒకరినొకరు ఆలోచనలు రేకేత్తిస్తున్నారు.   శేషయ్య కూలీల దగ్గరకు వచ్చి ఆరుగాలం కషించి మనం శ్రమతో చెమటోడ్చి పనిచేసిన సెంటు భూమి లేదన్నాడు. దీనిని కూలీలు, శేషయ్య వేసిన ప్రశ్నలను సమర్ధించారు.  దున్నుకోని బతుకాలంటే మనందరికి భూమి కావాలన్నాడు.   భూమి మన చేతిలో ఉన్నట్లయితే భాదలన్నీ తొలగిపోతాయి. ఆకలి చావులు అత్మహత్యలుండవు. కూలీజనుల ఆలోచనలు ఒకరినొకరు పంచుకుంటున్నారు. అయితే దున్నుకోవడానికి భూమి కావాలి మరి ఎక్కడుంది. అని కూలీలు ప్రశ్నించుకుంటున్నారు. ఇందులోంచి లేచిన గుడ్డి పోశవ్వ చెప్పసాగింది. దీంతో కూలీలంతా నిజమని నమ్మసాగారు. శేషయ్య మాట్లాడుతూ అవును వంద ఎకరాల భూమి దొర దగ్గర ఎందుకుంది మనకు ఎందుకలేదు. దొరల చేతిలో భూమి బందీగా మారింది. ఊరి జనమంతా కూలీ నాలీ పనులు చేసుకుంటూ మెతుకుకడుపులో లేక ఆకలితో కడుపులు మాడుతున్నాయి. దొర పుట్టినపుడే తెచ్చుకుండా, భూమిని భూమిలో ఉన్న ముళ్ల కంపను, చెట్లని కొట్టి భూమిని సాపు చేసాడా, నాగలి పట్టాడా, మొలకులు నాటాడా, సాగు చేశాడా ఏమీ చేయని దొరభూస్వాములకు పంట ఎందుకు చెందాలి. కూలీలు మాత్రం ఆ దొర భూస్వాములకు భయపడుతున్నాడు. ఎందుకంటే అండబలం, ఖండబలంతో ఏమైనా చేస్తాడేమోనని. రక్తం ఇచ్చి పోరాడితే భూములు మనకు వస్తాయి. పుడితే ఒకటి సత్తె రెండు. బతికి సచ్చేకంటే పోరాడి భూములను సాధించుకుందాం. కూలీ జనులందరూ, శేషయ్యలు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే దొర భూస్వాముల భూములను ఆక్రమించుకోవాలి. దున్నే వాడికి భూమి అనే నినాదంతో అందరూ ముందుక వచ్చారు. రాత్రికి రాత్రి కూలీ జనులంతా ఎకమైపోయారు. దొర భూస్వాముల భూములలో ఎర్రజెండాలు రెపరెపలాడుతున్నాయి. కూలీజనులంతా ఎద్దు నాగలై నడుస్తున్నారు. దొర భూస్వాముల గుండెల్లో గుబులు, వణుకు  పుట్టింది. ఎంచేయాలో, ఎటుపోవాలో ఆర్ధంకాక తలలు పట్టుకున్నారు. దొర భూస్వాములందరు పోలీసుల వద్దకు పోయి సార్‌ మీరే రక్షించాలంటూ ప్రాధేయ పడ్డారు.  దీంతో రెచ్చిపోయిన పోలీసులు ఇరవై మంది మూకుమ్మడిగా పల్లెపై దాడి చేసారు. భూస్వాముల భూముల్లో ఎర్ర జెండాలు పాతుతార్ర అంటూ సిఐ బాబుజీరావు పల్లె జనులపై నానా బూతులు తిడుతూ విరుచుకుపడుతూ దొరికిన వారిని దొరికినట్లు చితకబాదుతున్నారు. ఊరిలో ఏ మూల చూసినా పోలీసులే, కూలీలందరు ఇళ్లనుంచి పారిపోయారు. ఊరంతా రావణ కాష్టంగా మారిపోయింది. భూస్వాముల భూముల్లో పాతిన జెండాలను పోలీసులు పీకిపారేశారు. ఈ విషయం తెలుసుకున్న మల్లమ్య భయంతో బావి వద్దకు పరుగెత్తింది. భయంతో స్పృహ తప్పి పడిపోయింది. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. గడ్డి మోపును ఎత్తుకువస్తున్న రాములు మల్లమ్మను చూసి మోపును కిందకి దించి నెమ్మదిగా తీసుక వచ్చాడు. పోలీసులు మాత్రం భూముల్లో జెండాలు ఎవరు పాతారని రాములును పిడిగుద్దులు, తుపాకీ మడమలతో తీవ్రంగా కోట్టసాగారు. భూస్వాముల భూములను ఎలాగైనా పేద ప్రజలకు పంచి భూసంస్కరణలు అములు చేయాలని, మనం ఈ భూమిని సాగు చేసుకుంటే మన కష్టాలు పోతాయని కూలీలలో ఒకరినోకరు గుసగుసలాడుకుంటున్నారు. పోలీసుల దెబ్బలకు తాళలేక రాములు స్పృహతప్పి కింద పడిపోయాడు. చనిపోయాడని భావించిన పోలీసులు ఊరి నుంచి వెళ్లి పోయారు. రెండు గంటల వ్యవధిలో రాత్రి 11 గంటల సమయంలో తలుపులు బిగించుకుని నిద్రపోతున్నారు. తూర్పున చిట్టడవినుంచి కొంత మంది సాయుధ నక్సలైట్లు వీపులో కిట్టు బ్యాగులు, భుజంపై 303, ఎకె47 తూటాలు లతో ఊరిలోకి ప్రవేశించారు. ఊరి చివర దళిత వాడ ఉంటుంది. దళిత వాడకు రాగానే కుక్కలు మొరగసాగాయి. పోద్దంత పోలీసులు కొట్టిన దెబ్బలు నుంచి తేరుకోక ముందే పోలీసులు మళ్లీ వాచ్చారని పల్లే వాసుల భావించారు. ముసుగు తీసి చిమ్మచీకట్లో ఎవరు వచ్చారా అని తలుపు సందులోంచి తొంగి చూడసాగారు. ఎవ్వరి ఇళ్లలో వాళ్లు పోలీసులు మళ్లీ వచ్చారని దానిపై గుసగుసలు మొదలయ్యాయి. మళ్లీ ఏంజరుగుతుందోనని భయం మొదలయింది. నక్సలైట్‌ నాయకలయిన శాఖమూరి అప్పారావు(వెంకన్న), రామన్న, రమేష్‌లు భూస్వామి ఇళ్లలోకి ప్రవేశించి దొర భూస్వాములను ఊరి నడి వీధుల్లోకి తీసుకువచ్చి ప్రజా కోర్టు నిర్వహించారు. పేదల భూములను ఖబ్జా చేస్తారా అంటూ చితకబాదారు. పన్నెండు మంది నక్సలైట్లను చూసి భూస్వాముల భయపడుతున్నారు. పేదల జోలిక వస్తే ఖబద్దార్‌ అంటూ హెచ్చరించారు. తిరిగి వెళ్లి పోయారు. మరుసటి రోజు పోలీసులు గ్రామాన్ని చుట్టు ముట్టారు. ఊరు మొత్తం పోలీసులతో నిండిపోయింది. నక్సలైట్లు ఎలా వచ్చారని సోదాలు జరుపుతూ, వాడవాడల గాలింపు చెపట్టారు. పోలీసుల అనుమతి లేనిదే ఊరు విడిచి వెళ్లకూడదని రైతులను హెచ్చరించారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయం నెలకొంది. పోలీసులకు అనుమానం వచ్చిన మల్లమ్మను జీపులో తీసుకువెళ్లి రెండు రోజులపాటు స్టేషన్‌లో నిర్భందించారు. లాఠీల వర్షం కురిపిస్తూ విచారిస్తున్నారు. మల్లమ్మ నుంచి రహస్యాలు రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బెదిరిస్తునే ఇంకోవైపు బుజ్జగిస్తున్నారు.అయినా మల్లమ్య నుంచి ఎలాంటి సమాచారం లేదు. రహస్యాలు చెబితే వదులుతామని, పారితోషకం ఇస్తామని ఎరవేశారు. అయినా మల్లమ్మ నోటి నుండి తెలియదు అనే పదం తప్ప మరే పదాలు రావడం లేదు. రెండు రోజుల తరువాత మల్లమ్మను వదిలేశారు. అయినా పోలీసులకు మల్లమ్మ మీద అనుమానం పోలేదు. భూస్వాములన ఇన్‌ఫార్మర్లుగా వాడుకుంటున్నారు. మళ్లీ కొద్ద రోజులకు మల్లమ్మను అరెస్టు చేసి మూడు నెలలు చంచల్‌గూడా మహిళా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నాలుగు గోడల మధ్య ఉంటూనే పోరు దారిని మాత్రం వదలలేదు. మల్లమ్మ జీవితమంతా  సంవత్సరాలు నిత్య నిర్బందాలు, అణచివేతలను ఎదుర్కోంది. ఉద్యమాలలో చురుగ్గా పాల్గొంది.భూస్వాములు చేయ్యని ప్రయత్నంలేదు. అయినా అంతిమ విజయం మల్లమ్మదే. మరో వందేకరాల భూమి కోసం కూలీలు చేసిన ఉద్యమంలో కొంత విజయం సాధించినప్పటికి భూస్వాములు ప్రజలను దగ్గరకుచేర్చుకున్నారు. 15 సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమంలో కూలీ ఏజెంట్‌గా మారడంతో భూస్వాముల భూముల్లో నేడు రియల్‌ఎస్టేట్‌ విద్వంసం జరుగుతుంది. కళ చెదిరిన పల్లెలుగా తయారయింది. పేద ప్రజలకు భూములను పంచాలనే నక్సలైట్ల తపన కూలీలు ఎజెంట్లుగా మారడం వలన నీరుగారిపోయింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లింది. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం అడుగుపెట్టక ముందు పల్లె చుట్టూ ఎత్తైన కొండలు, వాగులు, వంకలు, చెరువులతో కళకళలాడుతుండేది. నేడు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో పల్లెలు జీవం కోల్పోతున్నాయి. పల్లె సంస్కృతి దెబ్బతింది. మెదక్‌ జిల్లా నాడు భూస్వాములతో అణచివేయబడిన ప్రాంతమది. తొలితరం అమరవీరుడు కిషన్‌ భూస్వాముల దాడిలో అనుమానాస్పదంగా మిగిలిపోయాడు. మగ్దుం మెహీద్దీన్‌ రచనలు సాహిత్యం వామపక్షా ఉద్యమానికి ఎంతగానో దోహదపడిరది. చెమటంటే తెలియని భూస్వాములు కూలీ జనుల రక్తాన్ని జలగల్లా తాగుతున్నారు. విందులు, విలాసాల్లో మునిగి తేలుతున్నారు. దళిత మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. పోలీసులనుండి తప్పించుకోడానికి వారికి డబ్బు ఆశ చూపారు. కొద్ది రోజుల తర్వాత నక్సలైట్లు మళ్లీ ప్రజాకోర్టు నిర్వహించారు. సర్పంచ్‌ను, భూస్వాములను శిక్షించారు. కథ అడ్డం తిరిగింది, భూస్వాములకు శిక్షిపడిరది. భాదిత మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల ఇప్పించారు. దొర భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉద్రుతం చేయడంతో వందలాది మంది పోలీసు బలగాలతో మూకుమ్మడి దాడి చేయించారు. ప్రభుత్వానికి కూలీజనులకంటే భూస్వాములే ఎక్కువయ్యారు. రాములు రగిలిపోయి పోలీసుల దమనకాండకు వ్యతిరేకంగా కూలీ జనులంతా దండుకట్టి ఎదుర్కోవాలని నిర్ణయించారు. అవసరమయితే ప్రజాసైన్యాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందరి ఆవేశం కట్టలు తెగుతుంది. రక్తం సముద్రంలో ఉప్పోంగింది. రక్తం రుచి మరిగిన అమెరికా సామ్రాజ్యవాదులు రాములు, వెంకన్నలపై తుపాకులు, తూటాలు కురిపించారు. రాములు, వెంకన్నలు ప్రజా ఉద్యమంలో అసువులు బాసారు. ప్రజా యుద్దంలో నేల రాలిన అరుణతారలు ధృవతారలయి సామ్రాజ్యవాదంపై చిరునవ్వుల యుద్దాన్ని ప్రకటిస్తున్నారు. నింగి నుంచి ఆకాశానికి ఎగిసిన రాములు , ఓరుగంటి సుదర్శన్‌,వెంకన్న శాఖమూరి అప్పారావు తారలై నిలిచారు.
`మెదక్‌  విప్లవోద్యమ నిర్మాతలు ఓరుగంటి సుదర్శన్‌,
శాఖమూరి అప్పారావుల స్మృతితో………  ‘మానేరు’