*పచ్చని సంసారాలలో చిచ్చు రేపుతున్న బెల్టు షాపులు .

*ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చిట్యాల వైన్స్ షాపులు.
-మామూలు” గానే తీసుకుంటున్న ఎక్సైజ్ అధికారులు.
-పార్క్ లైన్ వైన్ షాప్ నుండి బెల్టు షాపులకు ట్రాలీ ఆటో ద్వారా మద్యం సరఫరా.
-గ్రామాల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపులు.
చిట్యాల 7(జనంసాక్షి)ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మండలంలోని వైన్స్ షాప్ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కామిడి రత్నాకర్ రెడ్డి అన్నారు.  ఈ మేరకు శుక్రవారం మండలంలోని ఒడితల గ్రామంలో మద్యం సరఫరా చేస్తున్న ఆటోను మండల సర్పంచులు స్వాధీనం చేసుకొని ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. అనంతరం ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో మూడు ప్రభుత్వ దుకాణాలు మంజూరు కాగా అందులో మండల కేంద్రంలో పార్క్ లైన్ వైన్స్, వెంకటేశ్వర వైన్స్,చల్లగరిగ గ్రామంలో ఒక షాప్ ఉండగా ఈ మూడు షాపులు సిండికేట్ గా మారి బొత్తిగా సమయపాలన పాటించకుండా ఇందులో పార్క్ లైన్ వైన్ షాపు నుండి మద్యం బెల్టు షాపులకు ఎగుమతి చేస్తూ ఒక్కో బాటిల్ కు 100 నుండి 150 రూపాయలు వరకు వసూలు చేస్తూ ధనార్జనే ధ్యేయంగా మండలంలోని గ్రామాలకు ఎగుమతి చేస్తున్నారు.మండలంలోని వైన్స్ షాపుల నిర్వాహకులు ఈ దందాను కొనసాగిస్తున్న ఎక్సైజ్ అధికారులు మాత్రం స్పందించడం లేదని మద్యం ప్రియులు గోడు వెళ్ళబోతున్నారు.మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర వైన్స్ లో కావలసిన మద్యం దొరకదు, మద్యం ప్రియులు పార్క్ లైన్ వైన్స్ షాపుకు వెళ్లి కావలసిన మధ్యాన్ని అడుగగా ఎమ్మార్పీ కంటే 100 నుండి 150 రూపాయల వరకు అదనంగా తీసుకుంటున్నారు. పచ్చగా ఉండే పల్లెలలో వీరు గ్రామాలకు విరివిగా మందు సప్లై చేయడం మూలంగా గ్రామంలో యువత ముందుకు బానిసై అనారోగ్యాల పాలై చనిపోతున్నారు. 30 ఏళ్లకే వాళ్ళ భార్యలు వెధవరాలుగా మారుతున్నారు. గ్రామంలో కూరగాయలు దొరుకుతలేవు, కానీ ఏ వాడకు, ఏ గళ్ళకి ఏ సంధికి పోయినా గాని మద్యం ఏరులై పారుతుంది .టీనేజ్ పిల్లలు కూడా మద్యానికి బానిస అవుతున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే బెల్టు షాపులను మూసివేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని, కల్తీ మద్యం రాకుండా ఎప్పటికప్పుడు అధికారులు షాపులలో తనిఖీ చేయాలని, ఇప్పటికైనా సంబంధించిన అధికారులు స్పందించే అధిక ధర నియంత్రించి, కల్తీ మద్యాన్ని అరికట్టాలని మండల సర్పంచులు డిమాండ్ చేశారు.
Attachments area