పచ్చర్ల లో ఇంటింటికీ టిబి సర్వే : టిబి సూపర్ వైజర్ జయప్రకాశ్
జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) సెప్టెంబర్ 5 : క్షయ వ్యాధి ని టిబి మందులతో పూర్తిగా నయం చేయవచ్చని రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టిబి సూపర్ వైజర్ జయప్రకాశ్ అన్నారు. క్షయ వ్యాధి రోగుల గుర్తింపు కార్యక్రమం లో భాగంగా రాజోలి మండల పరిధిలోని పచ్చర్ల గ్రామం లో ఇంటింటికీ తిరిగి ఏ. సి. ఎఫ్. (ఆక్టింగ్ కేస్ ఫైండింగ్) టిబి సర్వేలుచేస్తున్నామని ఆయన మాట్లాడుతూ తెలిపారు. గత రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరము, ఆయాసం, తలనొప్పి, బరువు తగ్గడం లాంటి లక్షణాలు ఉన్న వారి వివరాలను నమోదు చేసి వారికి గళ్ళ డబ్బా లు ఇస్తున్నామని ఆయన ఆయన వివరించారు. తెల్లవారుజామున దగ్గు వచ్చిన వెంటనే బాగా గట్టిగ దగ్గు దగ్గి గళ్ళ డబ్బా లో వేయాలని, వాటిని మా ఆశా వర్కర్ల కు ఇస్తే వారు రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నకు పంపుతారు అని ఆయన అన్నారు. గళ్ళ డబ్బా లు ప్రతి రోజు సేకరించి వాటిని టిబి నోటిఫికేషన్ రెఫరెల్ రిజిష్టర్ లో నమోదు చేసి టి హబ్ వాహనం లో జిల్లా కేంద్రం నకు తరలించడం జరుగుతుందని ఆయన వివరించారు. జిల్లా కేంద్రం లో లాబ్ టెక్నీషియన్ పరీక్షలు చేస్తారు అని ఆయన అన్నారు. మేము పంపిన వాటిలో ఎవరికైనా పాజిటివ్ రిపోర్ట్ వస్తే వారికి 6నెలల వరకు ఉచితంగా టిబి మందులను పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. అందుకుగాను టిబి రోగి యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు జీరాక్స్ కాపీ ఇవ్వాలని ఆయన అన్నారు. టిబి రోగి క్రమం తప్పకుండా టిబి మందులు వాడితే టిబి పూర్తిగా తగ్గుతుందని , వారు భయపడవలసిన అవసరం లేదని అన్నారు. టిబి రోగి యొక్క వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఆయన అన్నారు. టిబి రోగి మందులతో పాటు పౌష్ఠిక ఆహారం తీసుకోవాలని అప్పుడే వారు త్వరగా కోలుకొని క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారని ఆయన మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమంలో టిబి సూపర్ వైజర్ జయప్రకాశ్, హెల్త్ అసిస్టెంట్ రంజిత్ కుమార్, ఏ ఎన్ ఎమ్ లు సుజాత, కిస్టమ్మ, ఆశా వర్కర్లు మల్లీశ్వరి, మహబూబ్, కమ్రూన్ తదితరులు పాల్గొన్నా