*పత్తి రైతులు పూత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు*
మద్దూర్ (జనంసాక్షి): నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని వివిధ గ్రామాల్లో పత్తి పంట వేసిన రైతులు ప్రస్తుతం పత్తి పంట పూత దశ నుండి లేత కాయ ఏర్పడే దశలో ఉందని మండల వ్యవసాయ శాఖ అధికారి ఉదయ్ కాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పత్తి పంట కొన్ని చోట్ల తలమాడు తెగులు గమనించడం జరిగిందని అన్నారు. ఇది తామర పురుగు వాహకం గా పనిచేస్తుంది.
దీని లక్షణాలు లేత ఆకులు పైకి ముడుచుకుని పోయి ఆకుల మీద ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. ఆకులు ఆకుపచ్చ మరియు పశువుపచ్చ సమ్మేళనంగా ఉంటాయి. ఉదృతే ఎక్కువగా ఉన్నప్పుడు పత్తి పంట ఆకులు అంచుల నుండి ఎండిపోయి ఇటిక రంగులు కనిపిస్తాయి, పంట ఎదుగుదల లోపిస్తుంది. గూడ కూడా సరిగా గూడ కూడా రాలిపోయే అవకాశం ఉందని అన్నారు. పత్తి పంట వేసినా రైతులు పూత దశలో
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1.ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఫిప్రోనిల్ 80% డబ్ల్యూ జి 0.2 గ్రామ్స్ /లీటర్ లేదా ఫిప్రోనిల్ 40% + ఇమిడాక్లోప్రిడ్ 40% డబ్ల్యూ జి 0.2 గ్రామ్స్ లేదా లీటర్ పిచికారీ చేయాలని అన్నారు.
2) 80 రోజుల తర్వాత యూరియా వాడకం నిలిపివేయాలి.
3) బెట్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మల్టీకే (13.0.45) 5 గ్రామ్స్/ లీటర్ పిచికారీ చేయాలి.
4) పంట చుట్టూ వయ్యారిభామ ఉమ్మెత్త లాంటి కలుపు మొక్కలు లేకుండా పత్తి రైతులు జాగ్రత్త పడాలని మద్దూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి ఉదయ కాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.