పత్రికా ప్రకటన

ఆనాధలు, అభాగ్యుల చెంతకు ఆనాధలు, అభాగ్యుల చెంతకు రాఖీ పౌర్ణమి వేడుకలు….
పండగ వచ్చినా, పబ్బంవచ్చినా ఆదరణకు, బంధాలకు, అనుబంధాలకు నోచుకోని ఆనాధలు, అభాగ్యులు, నిరాశ్రయులు, ఎవరైనా పలకరిస్తారా, ఆకలి తీరుస్తారా అనే ఎదురు చూపులు. రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్  రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీదనే జీవనం సాగిస్తున్న ఆనాధలు, అభాగ్యులు, నిరాశ్రయులను గుర్తించి  రాఖీలు కట్టి ఆహారాన్ని అందించి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాము. ఆ అభాగ్యులు చాల సంతోషాన్ని వ్యక్తం చేసారు. మమల్ని ఎవ్వరు పట్టించుకోరు మీరు వచ్చి మాకు రాఖీ కట్టి ఆహారాన్ని అందించడం మాకు చాల గొప్ప అనుభూతిని కలిగించింది అని అభాగ్యులు అన్నారు. ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ వై. సంజీవ కుమార్ వైస్ ప్రెసిడెంట్  ఓ.పావని  సభ్యులు ఇర్ఫాన్ మొదలగు వాళ్ళు  పాల్గొన్నారు.
కృతఙ్ఞతలు,
ప్రెసిడెంట్.       వై.సంజీవ కుమార్,
వైస్ ప్రెసిడెంట్,ఓ.పావని.