పదవ తరగతి 2009-2010 బ్యాచ్ ఔదార్యం
కడారి ప్రశాంత్ జ్ఞాపకార్థం కుర్చీలు పంపిణీ..
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 16 : చేర్యాల మండల పరిధిలోని మేజరు గ్రామ పంచాయతీ ఆకునూరు గ్రామంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థి కీర్తిశేషులు కడారి ప్రశాంత్ జ్ఞాపకార్థం 10వ తరగతి 2009-2010 బ్యాచ్ ఆధ్వర్యంలో సోమవారం ఆకునూరు, రాంపురం, మాసిరెడ్డిపల్లి గ్రామాల అంగన్ వాడి కేంద్రాలకు కుర్చీలు పంపిణీ చేసి ఔదార్యం చాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థిగా ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివి కరోనాతో మృతి చెందిన ప్రశాంత్ మరణం బాధాకరమని వారు అన్నారు. వారి జ్ఞాపకార్థం కోసమే స్నేహితులుగా కుర్చీలు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకునూరు సర్పంచ్ చీపురు రేఖ-మల్లేష్ యాదవ్, ఉపసర్పంచ్ బోయిని పద్మ-బాలయ్య, ఎంపీటీసీలు సుంకరి శ్రీధర్ గౌడ్, తౌట సుధారాణి-శ్రీశైలం, పాఠశాల చైర్మన్ కొంక శశిధర్, నాయకులు శనిగరం లక్ష్మణ్, రణం ప్రశాంత్, కడారి ఐలయ్య, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తోటి పూర్వ విద్యార్థులు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.