పదేళ్ల ప్రగతిని చూసి ఓటెయ్యండి
` వలసల వనపర్తి.. వరిపంటల వనపర్తి
` కరెంట్ కోతలు లేకుండా నిర్మూలించాం
` గత పదేళ్లలో బాధ్యతగా తెలంగాణను అభివృద్ది చేశాం
` ఉన్న తెలంగాణను ఆగం చేసిందే కాంగ్రెస్
` మళ్లీ వారిని నమ్ముకుంటే సమస్యలు కొనితెచ్చుకున్నట్లే..
` వనపర్తి ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ హెచ్చరిక
` అచ్చంపేట, మునుగోడు సభల్లోనూ ప్రతిపక్షాలపై ఫైర్
తెలంగాణ కోసం నేను పోరాడుతున్నప్పుడు ఈ నేతలంతా ఎవరి కాళ్లదగ్గర ఉన్నారో తెలియదు. పాలమూరు ప్రజలు బొంబయికి వలస పోయినప్పుడు ఎవరైనా వచ్చారా? పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ప్రజలు గుర్తు చేసుకోవాలి తెలంగాణ కోసం 24 ఏళ్ల క్రితం ఒంటరిగా ప్రయాణం ప్రారంభించా. నా పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టే.. విజయవంతం అయ్యాను. నాడు సరిపడా కరెంటు లేక, తాగునీరు, సాగునీరు లేక ఎన్నో కష్టాలు పడ్డాం. ఇవాళ దేశం మొత్తంలో 24గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే.
` అచ్చంపేట ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్
యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించలేక పోయింది. తెలంగాణ కోసం గొంతు ఎత్తింది ఎవరో.. ఉద్యమ కాలంలో నేతల కాళ్ల దగ్గర కూర్చున్నది ఎవరో గుర్తు చేసుకోవాలి పూటకో పార్టీ మారే వాళ్లకు సిద్ధాంతాలు ఉండవు. డబ్బు మదంతో పనిచేసే వాళ్లకు బుద్ధి చెప్పాలి. పాలమూరు ` రంగారెడ్డి పూర్తయితే శివన్నగూడెం ప్రాజెక్టుకు నీళ్లు ఇస్తాం. మునుగోడు నియోజకవర్గంలో 2లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తాం. చైతన్యవంతులైన నల్గొండ ప్రజలు ధన బేహార్‌లను తరిమికొట్టాలి.
` మునుగోడు ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్
వనపర్తి బ్యూరో/నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి/నల్గొండ బ్యూరో (జనంసాక్షి) : గతంలో వలసల వనపర్తిని.. వరి పంటల వనపర్తిగా చేసిన మొనగాడెవరని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణను ఒక పూల పొదరిల్లు మాదిరిగా తయారు చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ లేదు, సాగు, మంచినీళ్లు లేవు. ఇదే జిల్లా నుంచి లక్షల మంది వలస వెళ్లేవారు. రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు ఉండేవి. మేం బాధ్యతగా ఒక సంసారం ఎలా చేస్తారో పద్దతిగా, ఒళ్లు దగ్గర పెట్టుకుని, రూపాయికి రూపాయి కూడబెట్టి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఎన్నికల కోసం పిచ్చి మాటలు మాట్లాడలేదు. పేదల సంక్షేమానికి శ్రీకారం చుట్టాం. ఆగమాగం చేయలేదన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. మరోసారి కారు గుర్తుకు ఓటేసి వనపర్తి ఎమ్మెల్యేగా నిరంజన్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆనాడు ఉన్న తెలంగాణ ఊడగొట్టింది ఎవరని నిలదీశారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరుగుతున్నప్పుడు నోరెత్తకుండా ఉండిపోయింది ఎవరని ప్రశ్నించారు. ఇప్పుడు వనపర్తికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి కాబోతోందని, అది వస్తే లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయని అన్నారు. వరి పంటల వనపర్తి చేసిన మొనగాడు కావాలా? లేనిపోని ఉల్టాపల్టా చిల్లరగాళ్లు కావాలా అని ప్రజల్ని అడిగారు. కరవు మళ్లీ ఎదురు కాకుండా వనపర్తి తయారవుతుందని చెప్పారు. ప్రస్తుతం అడ్డంపొడువు మాట్లాడుతునోళ్లంతా.. నాడు ఎవరి బూట్లు మోసుకుంటు ఉన్నరో ప్రజలకు తెలుసునని సీఎం కేసీఆర్ అని విమర్శించారు. ఎన్నికలు వచ్చేశాయ్. తెలంగాణ సాధన తర్వాత పదో సంవత్సరం జరుగుతున్నది. ఈ పదేళ్లలో ఏం జరిగిందో అదంతా నిలువెత్తుగా విూ కళ్ల ముందు ఉన్నది. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒక్కటే. ఎలక్షన్లు చాలాసార్లు వస్తుంటాయ్.. పోతుంటాయ్. నేను చెప్పే నాలుగుమాటలను విూ గ్రామాలు, బస్తీలకు పోయిన తర్వాత చర్చ జరుపాలని కోరుతున్నాను. నిజానిజాలు తేల్చాలని కోరుతున్నాను. కారణం ఏంటంటే విూరు పేపర్లలో చూస్తున్నారని అన్నారు. 24ఏళ్ల నాడు పిడికెడు మందిమి.. ఇందులో నిరంజన్‌రెడ్డి ఒక్కరూ. ఎవరూ లేనినాడు ఉద్యమాన్ని ప్రారంభించాం. ఆ నాడు ఎవరు ఎక్కడ ఉన్నరో తెలుసు. ఎవరి బూట్లు మోసుకుంటు ఉన్నరో విూకు తెలుసు. కానీ, ఇవాళ కేసీఆర్ నువ్వు కొడంగల్‌కు రా.. అని ఒకడు. నువ్వు గాంధీ బొమ్మకాడికి ఇంకొకడు. 119 నియోజకవర్గాల్లో కేసీఆర్‌లు ఉన్నారు. వనపర్తి కేసీఆర్ నా పక్కన నిలబడి ఉన్నడు కాదా? నీ దమ్ము.. నా దమ్ము ఏంటంటే.. ఏ దమ్ము లేకుండా.. దమ్ము కోల్పోయి.. గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలకు ఆలవాలమైన పాత మహబూబ్‌నగర్ జిల్లా ఆ నాడు వలసపడి, గోసపడి ఎవరో వచ్చి గంజి, అంబలి కేంద్రాలు పెడితే బతకాలని ఒక శాపగ్రస్తమైన జిల్లా. ఆ నాడు పక్షుల్లా తిరుగుతుంటే ఈ నాడు ఉన్న నాయకులు ఎక్కడున్నరో విూకు తెలుసు’ అని చెప్పారు.అవాకులు, చెవాకులు.. చిన్న పెద్దంతరం లేకుండా నోటికి వచ్చేది వాగేది ఎవలో.. వాళ్లు ఏం పనిలో ఉన్నరో విూకు తెలుసు. మేం తిరిగిన నాడు.. ధైర్యం లేదు.. మంది లేరు.. నాయకులు లేరు. మంత్రి పదవులు లేవు అయినా పక్షుల్లా రాష్ట్రం నలుమూలల కలియదిగిరి.. జానాన్ని చైతన్యపరిచి.. అద్భుతమైన పాటలు రాసి.. ఇవాళ లేడు కానీ.. నా తమ్ముడు సాయిచంద్, గోరటి వెంకన్నలాంటి కవులు కళాకారులు.. ఎందరో బిడ్డలను ఏకం చేసి తెలంగాణ ఒక్క గొంతై నినదిస్తే అదికూడా 2004లో మన పొత్తుతో గెలిచి.. మన ఆగం చేయాలని చూసి.. 14 సంవత్సరాల తర్వాత నేను చావునోట్లో తలకాయపెట్టి చావునోట్లో ఆమరణ నిరాహార దీక్షకు కూసుకుంటే తెలంగాణ వచ్చింది. ఇవాళ మాట్లాడేది ఎవరో.. ఆ నాడు పోట్లాడిరది ఎవరో ఆలోచన చేయాలని కోరుతున్నానన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గతంలో ఎంతో మంది మంత్రులుగా పని చేశారని.. ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి పట్టుబట్టి.. మొత్తం 5 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలు గుర్తించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో కేసీఆర్‌లు ఉన్నారని అన్నారు. నేను రావాల్సిన అవసరం లేదని అన్నారు. ముస్లింలను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకు లాగానే చూసిందని విమర్శించారు. తెలంగాణ గురుకులాల్లో ఇవాళ వజ్రాల్లాంటి విద్యార్థులు తయారవుతున్నారని.. ఓట్ల కోసం అబద్ధాలు చెప్పబోమని అన్నారు. మళ్లీ గెలిస్తే.. పింఛన్లను దశలవారీగా రూ.5 వేలకు పెంచుతామని హావిూ ఇచ్చారు. రైతులకు ఏ ప్రభుత్వమైనా డబ్బులు ఎదురిచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణలోని వాల్మీకిబోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ.. రాష్ట్ర శాసనసభ రెండుసార్లు తీర్మానం చేసి పంపించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఈ మొద్దు ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం దాన్ని అక్కడ పెట్టుకుని కూర్చున్నది తప్ప.. చేయడం లేదు. ఈసారి కూడా కచ్చితంగా వాల్మీకి హక్కుల కోసం బీఆర్‌ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తదని కేసీఆర్ హావిూ ఇచ్చారు. రైతాంగం, ముస్లిం, దళిత వర్గం ఒకటే ఆలోచించాలి.. ముస్లింలను, దళితులను ఓటు బ్యాంకుగా వాడుకొని పేదవాళ్లను చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ కాదా..? అని కేసీఆర్ ప్రశ్నించారు. వనపర్తికి పశు వైద్యకాలేజీ, బైపాస్ రోడ్డు, ఇతర సదుపాయాలు కల్పిస్తాం. అవన్నీ జరిగిపోతాయి. జిల్లా కేంద్రమే అయిపోయింది. నీళ్ల నిరంజనుడు కడుపు నిండా నీళ్లు తెచ్చి ఇచ్చారు. గొప్ప పట్టణంగా వనపర్తి వెలుగొందుతోంది. నిరంజన్ రెడ్డిని మళ్లీ ఆశీర్వదించాలి. భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
దేశానికే దిక్సూచిలా తెలంగాణ ఎదిగింది : సీఎం కేసీఆర్
తెలంగాణ కోసం తాను పోరాడుతున్నప్పుడు ఈ నేతలంతా ఎవరి కాళ్లదగ్గర ఉన్నారో తెలియదని భారాస అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. పాలమూరు ప్రజలు బొంబయికి వలస పోయినప్పుడు ఎవరైనా వచ్చారా? అని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలో గతంలో గంజి, అంబలి కేంద్రాలు ఉండేవని, పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ప్రజలు గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘‘60లక్షల టన్నుల ధాన్యం పండే తెలంగాణ.. ఇవాళ 3కోట్ల టన్నుల ధాన్యం పండిస్తోంది. 24 గంటల కరెంటు ఇస్తే.. కాంగ్రెస్‌ను వీడి తెరాస కండువా కప్పుకొంటానని జానారెడ్డి సవాల్ విసిరారు. ఆ తర్వాత వెనక్కితగ్గారు. రైతు బంధు అనే పథకానికి ఆద్యుడు కేసీఆర్. రైతు బంధును దశలవారీగా రూ.16వేలకు పెంచుతాం. పాలమూరు`రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ నేతలు 109 కేసులు వేశారు. ప్రాజెక్టులు పూర్తయితే కేసీఆర్‌కు మంచిపేరు వస్తుందని కేసులు వేసి అడ్డుకున్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి అచ్చంపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తాం. ఎవరు గెలిస్తే తెలంగాణ ముందుకు వెళ్తుందో వారినే గెలిపించాలి. ఉన్న తెలంగాణ పోగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇస్తామని 2004లో ప్రకటించి 2014లో ఇచ్చారు. 32 పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ సాధించా’’ అని సీఎం కేసీఆర్ వివరించారు.
ఫ్లోరైడ్ సమస్యను పట్టించుకున్న పాపానపోలేదు
యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించలేక పోయిందని సీఎం కేసీఆర్ అన్నారు. నల్గొండ జిల్లా మనుగోడులో ఏర్పాటు చేసిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గానికి ఇచ్చిన హావిూలను నెరవేరుస్తున్నామన్నారు. తెలంగాణ కోసం గొంతు ఎత్తింది ఎవరో.. ఉద్యమ కాలంలో నేతల కాళ్ల దగ్గర కూర్చున్నది ఎవరో గుర్తు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటలు కరెంటు లేదు.. కానీ, తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నామన్నారు.’’తెలంగాణలో 3కోట్ల టన్నుల వరి పండుతోంది. రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తాం. పూటకో పార్టీ మారే వాళ్లకు సిద్ధాంతాలు ఉండవు. డబ్బు మదంతో పనిచేసే వాళ్లకు బుద్ధి చెప్పాలి. పాలమూరు ` రంగారెడ్డి పూర్తయితే శివన్నగూడెం ప్రాజెక్టుకు నీళ్లు ఇస్తాం. మునుగోడు నియోజకవర్గంలో 2లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తాం. ఉప ఎన్నికలో చూపిన చైతన్యాన్ని మునుగోడు ప్రజలు మళ్లీ చూపాలి. చైతన్యవంతులైన నల్గొండ ప్రజలు ధన బేహార్‌లను తరిమికొట్టాలి’’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.