పద్మశాలి కులస్తులు సమాజ అభివృద్ధికి నిరంతరం కృషి

పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆడెపు చంద్రయ్య

చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 23 : పద్మశాలి కులస్తులు నిరంతరం సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆడెపు చంద్రయ్య అన్నారు. ఆదివారం చేర్యాల పట్టణ పద్మశాలి సమాజం అధ్యక్షులు దూడం వెంకటేశం, ప్రధాన కార్యదర్శి మలిపేద్ది వెంకటేశం, కోశాధికారి నాగుల వెంకటేశంలు ఆధ్వర్యంలో పద్మశాలి యువజన సంఘం సభ్యులు కలిసి పద్మశాలి యువజన సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కొత్త బస్టాండ్ నుండి సినిమా థియేటర్ వరకు ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించారు. పద్మశాలి భవన్ లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఆడెపు మహేష్, ప్రధాన కార్యదర్శిగా గోనె శివ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఉపాధ్యక్షులు ఆడెపు చంద్రయ్య హాజరై నూతన అధ్యక్ష, కార్యదర్శి లను కులస్తులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పద్మశాలి సమాజం కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, సమాజంలో ప్రతీ ఒక్కరు ఐక్యంగా కలిసి మెలిసి ఉంటూ సమాజం అభివృద్ధికి పాటుపడాలని  మంచి పేరు తెచ్చేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు గోనే కిషన్ రావు, పాము బాలనర్సు, ఇప్పకాయల మల్లేశం, గోనె బిక్షపతి, మలిపేద్ది రాంచంద్రం, ఇప్పకాయల శ్రీను, కొక్కుల సురేందర్, కొంపెల్లి శ్రీనివాస్, నాగుల యశ్వంత్, ఆడెపు పవన్, గోనె నర్సింలు,థౌట రవీందర్, మాజీ యువజన సంఘం అధ్యక్షులు గోనె హరి, వీరబత్తిని రమేష్, వీరబత్తిని అరవింద్, కూడిక్యాల నరేష్, మలిపేద్ది లింగం, కులస్తులు, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.