పరీక్ష బహిష్కరణ

 

ఎలకతుర్తి: మండలంలోని ఒల్బాపూర్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆంగ్లం ఉపాధ్యాయుడు లేకపోవటంతో ప్రస్తుతం జరుగుతున్న త్రైమాసికి పరీక్షలను పదో తరగతి విద్యార్థులు బహిష్కరించారు. మంజూల అనే ఉపాద్యాయురాలు ఎడాదిక్రితం కరీంనగర్‌ పట్టణానికి డిప్యూటేషన్‌పై వెళ్లారు. అప్పటినుంచి నేటి వరకు ఉపాధ్యాయులను నియమించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పటుమార్లు రాస్తారోకో, ధర్నా చేసిన పట్టించుకోలేదన్నారు. కలెక్టర్‌కు, పీఎంకు ఉత్తరాలు రాసిన స్పందన లేదన్నారు. దీంతో నిరసన వ్యక్తం చేస్తూ ఆంగ్లం పరీక్షను బహిష్కరించారు.