పలు కుటుంబాల పరామర్శ

ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్
కడెం ఆగస్టు14(జనం సాక్షి )  మండలంలోని  లింగాపూర్ గ్రామంలో ఇటీవల పలు కారణాలవల్ల మృతి చెందిన ప్రముఖ స్కూల్ ప్రిన్సిపల్ గనగొనే విజయ్ కుమార్ మరియు గ్రామానికి చెందిన గడ్డం పెద్ద రాజన్న కుటుంబాలను ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ అన్నివిధాల ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని తెలియజేశారు.అనంతరం నర్సాపూర్ గ్రామంలో శైలజ ఇల్లు విద్యుత్ ఘాతంనికి అగ్నికి ఆహుతి కాగా ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు కాలిపోయిన ఇల్లును పరిశీలించి అధికారులతో మాట్లాడి తక్షణ సహాయం చెయ్యాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కడెం మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు